Begin typing your search above and press return to search.

గూచీ ప్ర‌చారంలో ఆలియా పోనీటెయిల్ లుక్

సోమవారం సాయంత్రం లండ‌న్ లో జరిగిన ఈవెంట్‌లో పాల్గొని, ఆ తర్వాత ఆలియా భారత్‌కు తిరిగి వచ్చారని తెలిసింది.

By:  Tupaki Desk   |   14 May 2024 5:34 PM GMT
గూచీ ప్ర‌చారంలో ఆలియా పోనీటెయిల్ లుక్
X

భార‌త‌దేశంలోనే అత్యంత క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది ఆలియాభ‌ట్. దీపిక, క‌త్రిన‌ లాంటి ప్ర‌తిభావంత‌మైన స్టార్ల బాట‌లో ఆలియా ప్ర‌తిభ‌తో మ‌న‌సులు గెలుచుకుంది. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోను ఈ బ్యూటీ త‌న‌దైన ముద్ర వేస్తోంది. బాలీవుడ్ లో ఉన్న అరుదైన ఫ్యాష‌నిస్టాగా హృద‌యాల‌ను గెలుచుకుంది. తాజ‌గా అలియా భట్ ప్ర‌ఖ్యాత గూచీ అంబాసిడ‌ర్ గా రెడ్ కార్పెట్ పై హొయ‌లొలికించింది. గూచీ ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆలియా. త‌న‌ మాతృమూర్తి సోనీ రజ్దాన్ త‌న కుమార్తెను 'చిన్న బొమ్మ' అని మురిపెంగా పిలుచుకుంది. లండన్‌లో జరిగిన గూచీ క్రూయిజ్ 2025 షోలో పాల్గొన్న ఆలియా ఇన్ స్టాలో ఆ ఫోటోల‌ను షేర్ చేసింది. సోమవారం సాయంత్రం లండ‌న్ లో జరిగిన ఈవెంట్‌లో పాల్గొని, ఆ తర్వాత ఆలియా భారత్‌కు తిరిగి వచ్చారని తెలిసింది.

అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. త‌న చేతిలో స్టైలిష్ గూచీ బ్యాగ్ క‌నిపించ‌గా, దానికి సరిపోలే జత హైహీల్స్‌తో తన రూపాన్ని అందంగా డిజైన్ చేసింది. అలాగే తన జుట్టును పోనీ టెయిల్ త‌ర‌హాలో ముడి వేయ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఆలియా ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. త‌న‌ తల్లి సోనీ రజ్దాన్ , అత్తగారు నీతూ కపూర్ కూడా ఆలియా ఎంతో అందంగా ఉంద‌ని ప్ర‌శంసించారు.

కొన్ని ఫోటోల్లో థాయ్ నటి దావికా హూర్న్ .. అమెరికన్ సింగర్ డెబ్బీ హ్యారీల త‌ర‌హాలో క‌నిపించింద‌ని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఆలియా ఫోటోలను షేర్ చేసిన వెంటనే అత్త‌గారైన‌ నీతు కామెంట్స్ విభాగంలో రెడ్ హార్ట్ ఎమోజీని షేర్ చేయ‌గా, మామ్ సోనీ ర‌జ్దానీ మూడు రెడ్ హార్ట్ ఎమోజీలతో 'హలో లిటిల్ డాల్' అని రాసింది. అంతకుముందు రోజు నటుడు డెమీ మూర్, గాయకుడు-నటుడు డెబ్బీ హ్యారీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఒక క్లిప్‌లో అలియా - థాయ్ నటి దావికా హూర్న్ కెమెరాకు పోజులిస్తూ న‌వ్వులు చిందించారు. మరొక వీడియోలో వారు నవ్వుతూ మాట్లాడుకోవ‌డం క‌నిపించింది. దక్షిణ కొరియా నటుడు పార్క్ గ్యు-యంగ్‌తో కలిసి అలియా కెమెరాకు పోజులిచ్చింది.

అలియా త్వరలో వేదంగ్ రైనా నటించిన జిగ్రా చిత్రంలో కనిపించనుంది. కరణ్ జోహార్‌తో కలిసి ఆలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ యొక్క జీ లే జరాలో కూడా అలియా నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. తన భర్త, రణబీర్ కపూర్ -విక్కీ కౌశల్‌తో కలిసి సంజయ్ లీలా భ‌న్సాలీ 'లవ్ అండ్ వార్‌'లో నటించనుంది. ఇవే కాకుండా YRF స్పై యూనివర్స్‌లో ఒక యాక్ష‌న్ చిత్రంలోను న‌టించ‌నుంది.