Begin typing your search above and press return to search.

ఆలియా టాలీవుడ్‌కి చిక్క‌దు దొర‌క‌దు

చూస్తుంటే ఆలియా భ‌ట్ ఇప్ప‌ట్లో తెలుగు సినిమాల్లో న‌టించే అవ‌కాశం లేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది

By:  Tupaki Desk   |   8 Feb 2024 8:30 AM GMT
ఆలియా టాలీవుడ్‌కి చిక్క‌దు దొర‌క‌దు
X

చూస్తుంటే ఆలియా భ‌ట్ ఇప్ప‌ట్లో తెలుగు సినిమాల్లో న‌టించే అవ‌కాశం లేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇంత‌కుముందు ఆర్.ఆర్.ఆర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో ఆలియా న‌టించింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ లేదా చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. బుచ్చిబాబుతో చ‌ర‌ణ్ సినిమాకి ఆలియానే క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్నార‌ని కూడా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. కానీ ఇవేవీ నిజాలు కావ‌ని తేలిపోయింది.

అలియా భట్ త‌దుప‌రి ఏడాది పాటు ఎవ‌రికీ కాల్షీట్లు కేటాయించ‌లేని స్థితిలో ఉంది. రణబీర్ కపూర్ - విక్కీ కౌశల్ ల‌తో క‌లిసి ఆలియా త‌దుప‌రి సంజయ్ లీలా భ‌న్సాలీ ఇతిహాసం 'లవ్ అండ్ వార్' కోసం క్రిస్మస్ 2025 వరకు వారి క్యాలెండర్‌లను బ్లాక్ చేసుకుంద‌ని తెలిసింది. 24 జనవరి 2024న లెజెండరీ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భ‌న్సాలీ తన త‌దుప‌రి భారీ చిత్రం 'లవ్ అండ్ వార్' ప్రకటనతో పరిశ్రమలో షాక్ వేవ్‌లను పంపారు. ఈ సినిమా కోసం చాలా ఉత్సాహంగా అభిమానులు వేచి చూస్తున్నారు. వారిలో కోలాహలం అంతా ఇంతా కాదు. రణబీర్ కపూర్, అలియా భట్ సహా కీల‌క తార‌లు ఇందులో న‌టించ‌నున్నారు. విక్కీ కౌశల్ లాంటి ప్ర‌తిభావంతుడు ఇందులో న‌టించ‌నుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది.

సంజయ్ లీలా భ‌న్సాలీ 'లవ్ అండ్ వార్' గ్రాండ్ టైటిల్ పోస్టర్‌తో అధికారికంగా ఖ‌రారైంది. ఈ పోస్ట‌ర్ సినిమా గ్రాండియారిటీని ప్రదర్శించడమే కాకుండా ప్రధాన తారాగణం సంతకాలను కూడా తెర‌పై చూపిస్తోంది. లవ్ అండ్ వార్ కోసం సంజయ్ లీలా భ‌న్సాలీ-రణబీర్ కపూర్ కాంబినేష‌న్ పై అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం క్రిస్మస్ 2025న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ వ్యూహాత్మకమైన విడుదల తేదీని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకోవడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇది ప్రేక్షకులకు పండుగ ట్రీట్ కానుంది.

రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ఈ ప్రాజెక్ట్ కోసం వంద‌శాతం ఎఫ‌ర్ట్ పెట్టేందుకు రెడీ అయ్యార‌ని తెలిసింది. పరిశ్రమ సోర్స్ ప్రకారం, ప్రధాన తారాగణం క్రిస్మస్ 2025 వరకు మొత్తం కాల్షీట్ల‌ను బ్లాక్ చేసిందని స‌మాచారం. అయితే లవ్ అండ్ వార్ షూట్ తర్వాత నితేష్ తివారీ రామాయణం కోసం రణబీర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతానికి 'లవ్ అండ్ వార్'కి సంబంధించిన వివరాలు దాచి ఉంచారు. నిస్సందేహంగా ఇది 2025లో అతిపెద్ద చిత్రం కానుంది.

లవ్ అండ్ వార్ తో, సంజయ్ లీలా బన్సాలీ బాలీవుడ్ ల్యాండ్‌స్కేప్‌లో నిస్సందేహంగా శాశ్వతమైన ముద్ర వేయడానికి నిస్సందేహంగా మునుపెన్నడూ లేని కొత్త అంశాన్ని చూపించ‌బోతున్నాడ‌ని భావిస్తున్నారు. ప్రేమ, యుద్ధం అనే స‌రికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు భ‌న్సాలీ సిద్ధమయ్యారు.