Begin typing your search above and press return to search.

ఆలియా భ‌ట్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఈ నికర విలువలో ఎక్కువ భాగం సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, ఇత‌ర‌ వ్యాపారాల నుండి ఆర్జిస్తున్న‌ట్టు తెలిసింది.

By:  Tupaki Desk   |   30 Aug 2023 11:30 PM GMT
ఆలియా భ‌ట్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
X

RRR బ్యూటీ ఆలియా భ‌ట్ నిక‌ర‌ ఆస్తుల విలువ ఎంత‌? ఒక్కో సినిమాకి ఎంత వ‌సూలు చేస్తుంది? ఇత‌ర వ్యాపారాలేమిటి? త‌న‌కు ఉన్న ఖ‌రీదైన అస్సెట్స్ ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి? ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

హిందీ చిత్రసీమ‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ స్టాట‌స్ ని అందుకున్న ఆలియా భ‌ట్ ని క‌ర‌ణ్ జోహార్ వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ చిత్రంతో ఆలియా క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసింది. 1999లో సంఘ‌ర్ష్ అనే చిత్రంతో బాల‌న‌టిగా కెరీర్ ని ప్రారంభించింది. నాటి నుంచి నేటి బ్లాక్ బస్ట‌ర్ మూవీ బ్ర‌హ్మాస్త్ర వ‌ర‌కూ ఆలియా ఎదురేలేని హ‌వా సాగించింది. నేటిత‌రంలో టాప్ హీరోయిన్ గా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంది.

ఆలియా ప్రతిష్టాత్మకమైన టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డ్ గ్రహీత. ఇటీవ‌లే ఈ బ్యూటీ 'హార్ట్ ఆఫ్ స్టోన్‌' చిత్రం(గాల్ గాడోట్‌)తో హాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆలియా సినిమాల్లో న‌టిస్తూనే ర‌క‌ర‌కాల వ్యాపారాల్లో త‌ల‌మునక‌లుగా ఉంది. సామాజిక సేవ‌లోను త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తోంది. డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి 'మిసు' అనే స్వచ్ఛంద సంస్థను ఆలియా ప్రారంభించింది. ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ డఫ్ & ఫెల్ప్స్ ప్రకారం.. అలియా భట్ నికర ఆస్తుల‌ విలువ USD 68.1 మిలియన్ (INR 557 కోట్లు)గా ఉంది. ఈ నికర విలువలో ఎక్కువ భాగం సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, ఇత‌ర‌ వ్యాపారాల నుండి ఆర్జిస్తున్న‌ట్టు తెలిసింది. ఒక్కో సినిమాకి సుమారు 15 కోట్లు వసూలు చేస్తుంది.

బాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ స్టార్ గా వెలుగుతున్న ఆలియా త‌న‌ స‌మ‌ర్థ‌త‌కు త‌గ్గ‌ట్టుగానే నికర ఆస్తుల‌ విలువ ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. అలియా గత ఏడాది తన మెటర్నిటీ లైన్ వ్యాపారాన్ని ప్రకటించింది. అలాగే తన సొంత దుస్తుల బ్రాండ్ Ed-A-Mamma ఇప్ప‌టికే బోలెడంత ప్రాచుర్యం పొందింది. ఈ సంస్థ‌ను 2020లో ప్రారంభించింది. కేవలం 150 ఎంపికలతో సస్టైనబుల్ చైల్డ్ వేర్ బ్రాండ్‌గా ఇది ప్రారంభమైంది. ఈ సంస్థ రేంజ్ ఏడాది కింద‌టే రూ. 150 కోట్ల వ్యాపార స్థాయికి చేరుకుంది. అయితే ఈ క్రేజీ కంపెనీని ముఖేష్ అంబానీ కుమార్తె కొనుగోలు చేసింద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపించాయి. ఇవే గాక‌.. ఆలియాకు 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' అనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అలియా నిర్మించిన 'డార్లింగ్స్' అదే బ్యానర్‌పై తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ప్రేక్షకులు విమర్శకుల నుండి మంచి సమీక్షలను పొందింది. అలాగే అలియా భట్ ఈ-కామర్స్ కంపెనీ నైకాలో కూడా వాటాలను కలిగి ఉంది. ఇందులో జూలై 2020 సంవ‌త్స‌రంలో రూ. 4.95 కోట్ల పెట్టుబడి పెట్టింది. 2013లో స్థాపించబడిన స్టైలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన స్టైల్‌క్రాకర్ అనే ఫ్యాషన్ స్టార్టప్‌లోను ఆలియాకు వాటా ఉంది.

అలియా పర్యావరణ స్పృహ కలిగిన న‌టి. స్థిరమైన ఎంపికలపై చాలా దృష్టి పెడుతుంది. అందుకే ఈ భామ‌ పూల వ్యర్థాలను సేకరించి ధూపం ఉత్పత్తులలో రీసైకిల్ చేసే Phool.co అనే D2C కంపెనీకి మద్దతు ఇచ్చింది. కంపెనీ యానిమ‌ల్ ఫ్రెండ్లీ. జంతువుల తోలు(లెద‌ర్‌)కు ప్రత్యామ్నాయంగా 'ఫ్లెదర్'ను అభివృద్ధి చేసింది.

కుర్ర బ్యూటీ విలాసాల‌కు కొద‌వే లేదు:

బంగ్లాలు కార్ లు విదేశాల్లో సొంత ఇల్లు ఇవ‌న్నీ ఆలియా లైఫ్ స్టైల్ కి అద్దంప‌డ‌తాయి. లండన్ లోని అల్ట్రా రిచ్ డ్రీమ్ హోమ్ మొద‌లు స్వాంకీ వానిటీ వ్యాన్ వరకు అలియా భట్ ఐదు ఖరీదైన డీల్స్ చేసింది. ఆలియా కేవలం 28 సంవత్సరాల వయస్సులో లండన్ లాంటి ఖ‌రీదైన న‌గ‌రంలో సొంత ఇంటిని వోన్ చేసుకోవడం నుండి విలాసవంతమైన కార్ల కు య‌జ‌మానిగా ఉంది.

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ భార్య గౌరీ ఖాన్ స్వ‌యంగా అలియా కోసం వానిటీ వ్యాన్ రూపకల్పన చేశారు. ప్రసిద్ధ డిజైనర్ అలియా వానిటీ వ్యాన్ ఇంటీరియ‌ర్ కి సాయం చేశార‌ట‌. ఇది క‌దిలే విలాస‌వంత‌మైన గృహం. ఆలియా ఫుల్ హ్యాపీగా ఉండే ముంబై అపార్ట్ మెంట్ ఎంతో విలాస‌వంత‌మైన‌ది. ఒక అపార్ట్ మెంట్ ఉన్నా కానీ అలియా ముంబైలోని జుహులో వేరొక అంద‌మైన అపార్ట్ మెంట్ ని కలిగి ఉన్నట్లు తెలిసింది. దీని కోసం ఆమె 13.11 కోట్ల రూపాయలను వెచ్చించింది. 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది.ఆమె దానిని షాహీన్ భట్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఆమెకు సొంత సంతోషకరమైన ప్రదేశం. ఈ ఇంటిని ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు చూడవచ్చు. ఇదేగాక‌.. అలియాకు కూడా 2460 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ వేరొక‌టి ఉంది. ప్రియుడు రణబీర్ కపూర్ మాదిరిగానే 32 కోట్ల రూపాయలకు ఈ ఇంటిని కొనుగోలు చేసింది.

అలియా తన కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాగులు ఆస్తులలో మాత్రమే కాకుండా నమ్మకమైన బ్రాండెడ్ ఖరీదైన వాహనాలపైనా పెట్టుబడులు పెట్టారు. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ & బిఎమ్‌.డబ్ల్యూ 7-సిరీస్ ను కలిగి ఉన్నారు. రేంజ్ రోవర్ వోగ్ ధర 1.88 కోట్ల రూపాయలు కాగా, ..బిఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ విలువ 1.37 కోట్ల రూపాయ‌లు. చానెల్ టు లూయిస్ విట్టన్,.. అలియా ఖరీదైన బ్యాగుల‌ను సేక‌రించే అల‌వాటును క‌లిగి ఉంది. అలియా తన గది నుండి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేప్పుడు చాలా ఖరీదైన హ్యాండ్ బ్యాగుల‌ను ఉప‌యోగిస్తుంది. బాలెన్సియాగా,.. చానెల్ .. సెయింట్ లారెంట్ వంటి బ్రాండ్లు తరచుగా అలియా వేషధారణతో కనిపిస్తాయి. ఏదేమైనా.. తన కొనుగోళ్ల‌లో అత్యంత ఖరీదైన కొనుగోలు లూయిస్ విట్టన్ బ్యాగ్. ఈ స్టైలిష్ బ్యాగ్ ధర సుమారు రూ .1.74ల‌క్ష‌లు. ఇలాంటి ఖ‌రీదైన ఆస్తులెన్నో త‌న సొంతం చేసుకుంది ఆలియా.