Begin typing your search above and press return to search.

సీత - రామరాజు మళ్లీ కలువనున్నారా?

చరణ్‌ మరియు ఆలియా కాంబోలో ఉన్న సన్నివేశాలు కొన్నే అయినా కూడా అవి అన్ని భాషల ప్రేక్షకులను అలరించారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 8:46 AM GMT
సీత - రామరాజు మళ్లీ కలువనున్నారా?
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చి సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో రామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌ నటించాడు. ఈ సినిమాలో రామ్‌ చరణ్ కి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ నటించడం జరిగింది.

చరణ్‌ మరియు ఆలియా కాంబోలో ఉన్న సన్నివేశాలు కొన్నే అయినా కూడా అవి అన్ని భాషల ప్రేక్షకులను అలరించారు. అందుకే ఇద్దరి కాంబోలో మళ్లీ సినిమా వస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. అందరి కోరికను బుచ్చిబాబు నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

మొన్నటి వరకు ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ ను హీరోయిన్‌ గా నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సినిమాలోని కీలకమైన గెస్ట్‌ రోల్‌ కి గాను బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ ను నటింపజేయాలని బుచ్చి బాబు భావిస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.

రామ్ చరణ్‌ సినిమాలో ఆలియా భట్‌ గెస్ట్ రోల్‌ లో నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంచి మిత్రులుగా కూడా ఇద్దరు పలు సందర్భాల్లో కలిసి కనిపించిన విషయం తెల్సిందే.

బుచ్చిబాబు మెయిన్‌ హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ ను నటింపజేస్తే ఆ కీలక పాత్రలో ఆలియా భట్ నటిస్తే కచ్చితంగా చరణ్‌ మరియు బుచ్చిబాబు కాంబో మూవీకి ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్స్ విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.