Begin typing your search above and press return to search.

టాలీవుడ్ గురి పెట్టిన అలియా.. నెక్స్ట్ ప్లాన్ అదే..!

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అలియా

By:  Tupaki Desk   |   18 July 2023 8:58 AM GMT
టాలీవుడ్ గురి పెట్టిన అలియా.. నెక్స్ట్ ప్లాన్ అదే..!
X

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అలియా భట్ లాస్ట్ ఇయర్ ఆర్.ఆర్.ఆర్ తో తెలుగు ఆడియన్స్ ని కూడా అలరించింది. ట్రిపుల్ ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ నటన ఆకట్టుకుంది. ఆ సినిమా టైం లోనే అలియా డెడికేషన్ గురించి అందరికీ తెలిసింది. ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా వైడ్ హిట్ అందుకుంది అలియా భట్. బ్రహ్మాస్త్రం సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో అలరించింది.

RRR తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన అలియా భట్ మళ్లీ ఇక్కడ సినిమా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న అలియా భట్ ఈ ఇయర్ రాకీ ఔర్ రాని కీ ప్రేమ్ కహాని సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాతో పాటుగా హర్ట్ ఆఫ్ స్టోన్ సినిమా కూడా చేస్తుంది అలియా భట్. ఈమధ్య తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న కారణంగా బాలీవుడ్ భామలంతా కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అలియా భట్ ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ లో నటించింది కాబట్టి తెలుగు ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. ఎన్.టి.ఆర్ సినిమాలో జాన్వి కపూర్, ప్రభాస్ సినిమాలో దీపిక, దిశా పటాని నటిస్తున్నారు. అందుకే అలియా కూడా తెలుగు ఆఫర్ ల కోసం ఎదురుచూస్తుంది. ఇక్కడ స్టార్ సినిమాల్లో నటించేందుకు తాను రెడీ అంటూ మన దర్శక నిర్మాతలకు మేనేజర్ తో లీడ్స్ ఇచ్చిందట. తెలుగు సినిమాలు బాలీవుడ్ పై కూడా ప్రభావం చూపిస్తున్న ఈ టైం లో ఇక్కడ అక్కడ ఫాం కొనసాగించాలంటే తెలుగు సినిమాలు బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటుంది.

అందుకే తెలుగు అవకాశాల కోసం అలియా భట్ ఎగ్జైటెడ్ గా ఉందట. అయితే ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాల్లో హీరోయిన్స్ ఫైనల్ అవగా స్టార్ సినిమాల్లో నెక్స్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఆమె ఛాన్స్ అందుకోవాలని చూస్తుంది. మహేష్ రాజమౌళి సినిమాలో అలియా భట్ నటించే ఛాన్స్ లు ఉన్నాయని ఇన్నర్ టాక్.

ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ కోసం రాజమౌళితో పనిచేసిన అలియా ఈ సినిమా అవకాశం వస్తే మాత్రం అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. వద్దన్న వారి వెంట పడటం కన్నా ఆసక్తి చూపిస్తున్న అలియా భట్ లాంటి వారితో తెలుగు మేకర్స్ సినిమాలు చేస్తే బెటర్ అని ఆడియన్స్ కూడా అంటున్నారు.