Begin typing your search above and press return to search.

గుచ్చే గులాబి లాగా.. వెలుగిచ్చే మతాబులాగా..!

ట్రిపుల్ ఆర్ లో సీత పాత్రలో మెప్పించిన అలియా భట్ ఆ తర్వాత నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   11 March 2024 2:44 PM IST
గుచ్చే గులాబి లాగా.. వెలుగిచ్చే మతాబులాగా..!
X

టాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్ ఏం చేసినా దానికో స్పెషాలిటీ ఉంటుంది. పెళ్లైన తర్వాత గ్లామర్ విషయంలో హీరోయిన్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎంతో కొంత తేడా అనేది కనిపిస్తుంది. కానీ అలియా భట్ ఒక బిడ్డకు జన్మనిచ్చినా కూడా అలానే క్యూట్ గా కనిపిస్తుంది. తన లుక్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్న అమ్మడు మొన్నటిదాకా నార్త్ ఆడియన్స్ మాత్రమే టార్గెట్ పెట్టుకోగా ఆర్.ఆర్.ఆర్ తర్వాత అమ్మడి మాయలో సౌత్ ఆడియన్స్ కూడా పడిపోయారు.


ట్రిపుల్ ఆర్ లో సీత పాత్రలో మెప్పించిన అలియా భట్ ఆ తర్వాత నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని అలరిస్తుంది అలియా భట్. లేటెస్ట్ గా అమ్మడు శారీ లుక్ తో అదరగొట్టే ఫోటో షూట్ చేసింది./

బ్లాక్ కలర్ శారీ బ్లాక్ బ్రౌన్ మిక్సెడ్ జాకెట్ తో క్రేజీ ఫోటో షూట్ చేసింది అలియా భట్. అలా చూస్తూ తన సోయగాల వల వేస్తున్న అమ్మడు తన చూపులతో గుండెల్ని గుచ్చేస్తున్నట్టు ఉంది. శారీలో కూడా ఇంత హా**ట్ అప్పీల్ చేయొచ్చు అని అలియా ఫోటో షూట్ చూస్తేనే తెలుస్తుంది. ఫాలోవర్స్ కు స్పెషల్ ట్రీట్ అందించడంలో వెనక్కి తగ్గని అలియా భట్ లేటెస్ట్ శారీ ఫోటో షూట్ తో పిచ్చెక్కిస్తుంది.

అలియా భట్ సినిమాల విషయానికి వస్తే అమ్మడు ప్రస్తుతం జిగ్రా సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నటించడమే కాదు సినిమాను నిర్మిస్తుంది కూడా అలియానే అవ్వడం విశేషం. సినిమాల గ్యాప్ వచ్చినా ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది అలియా. సౌత్ లో కూడా అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడగా RRR తర్వాత మళ్లీ ఛాన్స్ వస్తే తెలుగు సినిమాల్లో నటించేందుకు రెడీ అనేస్తుంది అమ్మడు.

అలియా ఎప్పుడు కొత్త ఫోటో షూట్ చేసినా వాటి గురించి సోషల్ మీడియాలో స్పెషల్ డిస్కషన్ అవుతుంది. ఆమె సౌత్ ఫ్యాన్స్ అలియాని మరిన్ని తెలుగు సినిమాల్లో చూడాలని ఆశిస్తున్నారు. అలియా కూడా సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తుంది. అయితే సరైన అవకాశం వస్తేనే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తుంది.