Begin typing your search above and press return to search.

ఆ గ‌న్నుల‌న్నిటి కంటే మాదే పెద్ద గ‌న్?

ఇటీవ‌ల సందీప్ వంగా `యానిమ‌ల్` కోసం మ‌ళ్లీ ఇదే త‌ర‌హాలో భారీ మెషీన్ గ‌న్ సీన్ ని రిపీట్ చేసాడు.

By:  Tupaki Desk   |   1 April 2024 3:15 AM GMT
ఆ గ‌న్నుల‌న్నిటి కంటే మాదే పెద్ద గ‌న్?
X

ఇటీవ‌ల బిగ్ బ‌డ్జెట్ యాక్ష‌న్ సినిమాల్లో భారీ మెషీన్ గ‌న్ సీన్స్ కామ‌న్ గా మారాయి. ద‌క్షిణాదిన కేజీఎఫ్ రాఖీభాయ్ భారీ మెషీన్ గ‌న్స్ తో హ‌ల్ చ‌ల్ చేసిన విధానం చాలా కాలం పాటు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కేజీఎఫ్ లో మెషీన్ గ‌న్స్ ని విచ్చ‌ల‌విడిగానే ఉప‌యోగించారు. అయితే త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా దీనిని ఫాలో అయ్యాడు. త‌న సినిమాలు కైథీ, విక్ర‌మ్ లో భారీ మెషీన్ గ‌న్ ని వినియోగించాడు. విక్ర‌మ్ లో క‌మ‌ల్ హాస‌న్ దీనిని ఉప‌యోగించిన విధానం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు చుక్క‌లు చూపించింద‌ని చెప్పాలి. కొన్న నిమిషాల పాటు క‌ళ్లు చెదిరేలా మిరుమిట్లు గొలిపే విజువ‌ల్ ఎక్స్ పీరియెన్స్ ని థియేట‌ర్ల‌లో అనుభ‌వించారు.

ఇటీవ‌ల సందీప్ వంగా `యానిమ‌ల్` కోసం మ‌ళ్లీ ఇదే త‌ర‌హాలో భారీ మెషీన్ గ‌న్ సీన్ ని రిపీట్ చేసాడు. ఇది కూడా ఆడియెన్ ని బాగానే ఆక‌ట్టుకుంది. ర‌ణ‌బీర్ భీక‌ర‌మైన మెషీన్ గ‌న్ చేత‌ప‌ట్టి ప్ర‌త్య‌ర్థుల‌ను చెడుగుడు ఆడేయ‌డాన్ని అంతా ఎంజాయ్ చేసారు. ప‌ఠాన్ లో షారూఖ్, భోలా చిత్రంలో దేవ‌గ‌న్ (హీరో కం ద‌ర్శ‌కుడు) కూడా భారీ మెషీన్ గ‌న్ లు ఉప‌యోగించారు.

అయితే ఇంత‌మందిలో ఇంత‌గా స్ఫూర్తి ర‌గిలించిన భారీ మెషీన్ గ‌న్ కి మూలం ఎక్క‌డ ఉంది? అన్న‌ది వెతికితే ఇప్పుడు స‌మాధానం ల‌భించింది. నిజానికి ఈ భారీ మెషీన్ గ‌న్ ట్రెండ్ ని ప్రారంభించిన‌ది అలీ అబ్బాస్ జాఫ‌ర్. `టైగర్ జిందా హై`తో భారతీయ సినిమాలో భారీ మెషిన్ గన్ సీన్ ట్రెండ్‌ను ప్రారంభించాడు. తాజా ఇంట‌ర్వ్యూలో అలీ అబ్బాస్ జాఫ‌ర్ ఒక కామెంట్ కూడా చేయ‌డంతో మ‌ళ్లీ ఇది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ``మీరు చాలా మంది నటీనటులకు తుపాకీని ఇవ్వవచ్చు కానీ సల్మాన్ ఖాన్ ఆ తుపాకీని కాల్చే విధంగా ఎవరూ కాల్చలేరు!`` అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

కైతి (2019), విక్రమ్ (2022), KGF - చాప్టర్ 2 (2022), పఠాన్ (2023), భోలా (2023) వంటి చిత్రాలలో భారీ మెషీన్ గ‌న్స్ తో సన్నివేశాలు తెర‌కెక్కినా వాట‌న్నిటి కంటే స‌ల్మాన్ సినిమాలోనే ది బెస్ట్ అనేది అత‌డి ఉద్ధేశం. ఇత‌ర‌ హీరోలెవ‌రూ స‌ల్మాన్ భాయ్ లా తుపాకీని పేల్చ‌లేర‌ని తేల్చేశాడు జాఫ‌ర్. `బడే మియాన్ చోటే మియాన్` ప్రమోషన్స్ లో అత‌డు పైవిధంగా కామెంట్ చేసాడు. టైగర్ జిందా హైలో ఒకే ఒక్క సల్మాన్ ఖాన్ .. ఒకే ఒక తుపాకీ సన్నివేశం ఉంది. మీరు చాలా మంది నటులకు తుపాకీని ఇవ్వవచ్చు కానీ అతడు(స‌ల్మాన్) తుపాకీని కాల్చే విధానం వేరు.. ఎవరూ అలా కాల్చలేరు. అది మిస్టర్ సల్మాన్‌కి నా సన్మానం! అని జాఫ‌ర్ వ్యాఖ్యానించాడు.

అయితే ఇప్పుడు ఇంత గొప్ప‌గా చెప్పుకుంటున్న భారీ మెషీన్ గ‌న్ స‌న్నివేశానికి హాలీవుడ్ స్ఫూర్తి త‌ప్ప‌క ఉంది. ప్ర‌ఖ్యాత యాక్ష‌న్ స్టార్ సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ న‌టించిన ఫ‌స్ట్ బ్ల‌డ్, రాంబో లాంటి చిత్రాల్లో భారీ మెషీన్ గ‌న్స్ వినియోగం అప్ప‌ట్లోనే ట్రెండ్ సెట్ట‌ర్. 80లు 90ల‌లోనే ఈ ట్రెండ్ హాలీవుడ్ లో కొన‌సాగింది. చాలా భారీ చిత్రాల్లో గ‌న్స్ ని చాలా తేలిక‌గా ఉప‌యోగించారనేది అలీ అబ్బాస్ జాఫ‌ర్ గ‌మ‌నించాలి.

ఒక్కో మెట్టు తెలివిగా ఎక్కాడు:

మేరే బ్రదర్ కి దుల్హన్ (2011)తో కెరీర్ ని ప్రారంభించిన జాఫ‌ర్ ఆ త‌ర్వాత‌ గేర్ మార్చి `గుండే` (2014) అనే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ స్కేల్‌ని హ్యాండిల్ చేసిన విధానం అత‌డిపై న‌మ్మ‌కం పెంచింది. దీంతో అతడు తన మూడవ చిత్రం సుల్తాన్ (2016)లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని డైరెక్ట్ చేయ‌గ‌లిగాడు. ఇది భారీ బ్లాక్ బస్టర్. తదుపరి చిత్రం టైగర్ జిందా హై (2017) ద‌ర్శ‌క‌త్వ ఆఫ‌ర్ ని కొట్టేశాడు. ఇదే కాంబినేష‌న్ రిపీటై విజ‌యం సాధించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో సల్మాన్‌ ఖాన్‌ భారీ మెషిన్‌ గన్‌తో విరుచుకుప‌డే సీన్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఇటీవ‌లి కాలంలో దేశవ్యాప్తంగా యాక్ష‌న్ సినిమాల ద‌ర్శ‌కులు దీని నుండి ప్రేరణ పొందితే అది తప్పు కాదు.