డ్యాన్సులు ఫైట్స్‌లో లేడీ గన్స్ తడాఖా
శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆల్ఫా'పై భారీ అంచనాలేర్పడ్డాయి. దీనికి కారణం ఆలియా భట్, శార్వరి వాఘ్ లాంటి క్రేజీ భామలు కీలక పాత్రల్లో నటిస్తుండటమే.
By: Tupaki Desk | 14 Jun 2025 4:04 AMఇద్దరు అందమైన లేడీ స్పైలు(మహిళా గూఢచారులు) అరివీర భయంకరమైన పోరాటాలు చేస్తూ తెర నిండుగా యాక్షన్ విన్యాసాలతో రక్తి కట్టిస్తే అది ఎలా ఉంటుందో `ఆల్ఫా`లో చూడబోతున్నాం. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ లో మొదటి లేడీ స్పై యాక్షన్ చిత్రమిది. దీనిని సూపర్ గాళ్ తరహా పాత్రలతో రూపొందిస్తున్నారు.
శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆల్ఫా'పై భారీ అంచనాలేర్పడ్డాయి. దీనికి కారణం ఆలియా భట్, శార్వరి వాఘ్ లాంటి క్రేజీ భామలు కీలక పాత్రల్లో నటిస్తుండటమే. ఫ్రాంచైజీలో ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ ప్రత్యేక అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 క్రిస్మస్ వారాంతంలో థియేటర్లలోకి రానుంది.
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాలో లేడీ గూఢచారుల ఫైటింగ్ విన్యాసాలతో పాటు, డ్యాన్సుల్ని రక్తి కట్టించేలా చూపించబోతున్నారు. ఆల్ఫాలో అలియా భట్- శార్వరి కొత్త డ్యాన్స్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ లో బిజీగా ఉన్నారు. ఈ పాట ఆకట్టుకునే విజువల్స్‌తో కూడిన ఎనర్జిటిక్ డ్యాన్స్ పీస్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. అలియా - శార్వరి ఇద్దరూ సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. వారి నటన డ్యాన్సులను మెరుగుపర్చడానికి చాలా కష్టపడుతున్నారు.
భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ పాట కోసం అలియా - శార్వరి రెండు నెలలకు పైగా ప్రిపేరయ్యారు. ముంబైలోని YRF స్టూడియోస్‌లో ఈ జోడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. కొరియోగ్రఫీ సవాళ్లను నిర్వహించడానికి వారి ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. యాక్షన్ ప్యాక్డ్ కంటెంట్ తో రక్తి కట్టించనున్న ఈ చిత్రంలో ఆలియా- శార్వరిపై ఏదైనా అద్భుతమైన పాటను చిత్రీకరించాలని భావించాం. హై ఎనర్జీతో ఈ పాట అలరిస్తుంది! అని మేకర్స్ తెలిపారు.