Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : స్విమ్మింగ్ పూల్‌లో ఆలియా భట్‌

సినిమా ఇండస్ట్రీకి చెందిన బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన ఆలియా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   21 May 2025 11:01 PM IST
పిక్‌టాక్ : స్విమ్మింగ్ పూల్‌లో ఆలియా భట్‌
X

సినిమా ఇండస్ట్రీకి చెందిన బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన ఆలియా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన ప్రతిభతో ఆలియా బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా ఆలియా నిలిచింది. ఈతరం హీరోయిన్స్‌లో అత్యధిక అవార్డులను సొంతం చేసుకున్న హీరోయిన్‌ కూడా ఆలియా అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆలియా భట్‌ ఏకంగా ఆరు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అత్యధిక పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేసే ఆలియా భట్‌ సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 86.2 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆలియా భట్‌ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తన సినిమాల అప్డేట్స్‌తో పాటు, రెగ్యులర్‌ అప్‌డేట్స్ను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. కళ్లకు మాస్క్‌ ధరించి, సరదాగా స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతున్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్‌, షేర్స్‌ దక్కించుకుంది. తాజా ఫోటోలు ఎప్పటిలాగే ఆలియా భట్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి అయ్యి, తల్లిగా మారిన తర్వాత కూడా ఆలియా అందం ఏమాత్రం తగ్గలేదు.

2024లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో టాప్‌ 100లో చోటు సొంతం చేసుకుంది. టైమ్స్‌ ఇంపాక్ట్‌ 2022లోనూ టాప్‌ 100లో చోటు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఆలియా భట్‌ హీరోయిన్‌గా స్టార్‌ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించడం ద్వారా తన పాపులారిటీని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్న ఆలియా భట్‌ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆలియా భట్‌ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటాయని అభిమానులు అంటూ ఉంటారు. ఆమె అందంతో మాత్రమే కాకుండా అభినయంతోనూ మెప్పించగల సామర్థ్యం ఉన్న నటి అని మళ్లీ మళ్లీ నిరూపితం అవుతూనే ఉంది.

ప్రస్తుతం ఆలియా భట్‌ హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్‌ సినిమా కావడం విశేషం. సౌత్‌లో రాజమౌళి దర్శకత్వంలో ఈమె ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయినా కూడా ఆలియా పాత్ర అందులో నామమాత్రంగానే ఉండటంతో ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆలియా కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని తన పాత్ర విషయంలో నిరుత్సాహం వ్యక్తం చేసిందని టాక్‌ వచ్చింది. ఆలియా భట్‌ నటిస్తున్న సినిమాలు ఈమధ్య తెలుగులోనూ మంచి మార్కెట్‌తో విడుదల అవుతున్నాయి. కనుక ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని తెలుగు సినిమాలు, పాన్‌ ఇండియా సినిమాలు చేస్తుందేమో చూడాలి.