కేన్స్‌కి ఆలియా స్కిప్ వెనక షాకింగ్ రీజన్?
ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో ఐశ్వర్యారాయ్, నందితా దాస్, పల్లవి జోషి సహా పలువురు భారతీయ సెలబ్రిటీలు మెరుపులు మెరిపించారు.
By: Tupaki Desk | 19 May 2025 10:44 PM ISTఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో ఐశ్వర్యారాయ్, నందితా దాస్, పల్లవి జోషి సహా పలువురు భారతీయ సెలబ్రిటీలు మెరుపులు మెరిపించారు. జాన్వీ కపూర్, అతిదీరావ్ హైదరీ కూడా ఈ వేదికను అలంకరించనుందని కథనాలొచ్చాయి. అయితే కేన్స్ 2025 వేదికపై డెబ్యూ ఇవ్వాలని ఆశపడిన ఆలియా కోరిక మాత్రం నెరవేరకుండా పోయింది.
నిజానికి కేన్స్ ఉత్సవాల్లో ఆరంభంలోనే ఆలియా భట్ రెడ్ కార్పెట్ పై నడవాల్సి ఉండగా, సడెన్ గా స్కిప్ కొట్టింది. దీనికి కారణం ఇండియా- పాకిస్తాన్ వార్ ని కారణమని, భారతదేశానికి మద్ధతునిచ్చేందుకే ఇలా చేసిందని ఆలియా పీఆర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఆలియా త్వరలోనే కేన్స్ ఉత్సవాల్లో అడుగుపెడుతోందని ప్రచారం సాగింది. కానీ ఇప్పటివరకూ ఆలియా ఫ్రాన్స్ కి వెళ్లనే లేదు.
అయితే ఇప్పుడు దీనికి షాకింగ్ కారణం ఒకటి బయటపడింది. ఈసారి కేన్స్ ఉత్సవాల్లో నేలను తుడిచేసేంతగా పొడవాటి దుస్తులను వేలాడేస్తూ, వాటిని సవరించేందుకు పది మంది అనుచరులను వెంట తిప్పుకునేందుకు ఆస్కారం లేదు. ఈసారి కేన్స్ కమిటీ ఆన్-గ్రౌండ్ డ్రెప్స్‌తో కూడిన పొడవాటి దుస్తులు అనుమతించకపోవడమే ఆలియా ఆబ్సెన్సీకి కారణమని తెలుస్తోంది. ఏదో ఒక సమయంలో ఆలియా కేన్స్ లో అడుగుపెడుతుంది. అది ఎప్పుడు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈరోజు సాయంత్రమే జాన్వీకపూర్, అతిథీరావ్ హైదరీ కేన్స్ కు ప్రయాణమవుతూ కనిపించారు. ఆ ఇద్దరి ఫోటోలు కొద్దిసేపటి క్రితమే అంతర్జాలంలోకి వచ్చాయి.
