RRR సీత రెండోసారి ఫ్రెగ్నెంట్!
RRR సీతగా తెలుగు వారి గుండెల్లో నిలిచింది ఆలియా భట్.` బ్రహ్మాస్త్ర` చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 24 May 2025 9:31 PM ISTRRR సీతగా తెలుగు వారి గుండెల్లో నిలిచింది ఆలియా భట్.` బ్రహ్మాస్త్ర` చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఆలియా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా అనే కుమార్తె కూడా ఉంది. రాహా 2022 నవంబర్ 6న జన్మించింది. రాహా మూడో బర్త్ డేని ఘనంగా జరుపుకుంది. ఒక బిడ్డకు మమ్మీ అయ్యాక కూడా ఆలియా నటిగా కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఇటీవల పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
అయితే రెడ్డిటర్ల తాజా వివరం ప్రకారం.. ఆలియా భట్ రెండోసారి ఫ్రెగ్నెంట్. శుక్రవారం నాడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలియా భట్ ఘనంగా అరంగేట్రం చేయగా, తన తొలి లుక్ కోసం షియాపరెల్లి గౌను ధరించి షో స్టాపర్ గా నిలిచింది. లోరియల్ పారిస్ లైట్స్ ఆన్ ఉమెన్స్ వర్త్ ఈవెంట్ లో అర్మానీ ప్రైవ్ గౌనులో తళుక్కుమంది. అయితే నెటిజనులు ఆలియా లుక్ పై డీప్ గా రీసెర్చ్ చేసారు. కొందరు ఆలియా మళ్ళీ గర్భవతి కావచ్చునని ఊహించారు. రెడ్డిటర్లు సహా పలువురు నెటిజనులు సోషల్ మీడియాల్లో దీనిపై బిగ్ డిబేట్ నడిపించడం చర్చగా మారింది.
ఒక వ్యక్తి రెడ్డిట్‌లో వ్యాఖ్యానిస్తూ..``కొన్ని కోణాల నుండి చూస్తే, ఆమె(ఆలియా) గర్భవతిగా కనిపిస్తుంది`` అని రాసారు. అవును..ఆమె గర్భవతి అని నేను అనుకుంటున్నానని మరొకరు వ్యాఖ్యానించారు. ``ఆమె మొదటి లుక్ చూసిన వెంటనే నాకు కూడా అదే ఆలోచన వచ్చింది.. ఎందుకో నాకు అర్థం కాలేదు`` అని వేరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ``ఆలియా మళ్ళీ గర్భవతి అయిందా? అలాగే.. చాలా ముద్దుగా ఉంది`` అని రాసారు. ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్`లో నటిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ స్పై యాక్షన్ సినిమా ఆల్ఫాలోను లీడ్ పాత్రలో నటిస్తోంది.
