రేఖలా కనిపించి రేఖకే షాకిచ్చింది!
ఈ వెన్యూకి విచ్చేసిన ఆలియా అందరికీ బిగ్ షాకిచ్చింది. `సిల్సిలా` చిత్రంలో రేఖ పోషించిన చాందిని లుక్ ని ఆలియా గుర్తు చేసింది.
By: Tupaki Desk | 28 Jun 2025 9:15 AM ISTఅందానికి నిర్వచనం ఇవ్వమని అడిగితే- రేఖ అని చెబుతారు. ఇప్పటికీ ఏజ్ లెస్ బ్యూటీగా నటి రేఖ పబ్లిక్ అప్పియరెన్సులు అందరినీ షాక్ కి గురి చేస్తుంటాయి. ఇప్పుడు రేఖలా కనిపించి రేఖకే బిగ్ షాకిచ్చింది ఆలియా భట్. అదే ముక్కు.. అవే కళ్లు.. మురిపెంగా నవ్వు.. అందమైన మోము చూడగానే అచ్చం రేఖనే తలపించింది. ఇటీవల `ఉమ్రావ్ జాన్` సినిమా ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమానికి హాజరై, ప్రముఖ నటి రేఖకు ఆలియా భట్ నివాళులర్పించారు. 1981లో వచ్చిన క్లాసిక్ మూవీ `సిల్సిలా` సినిమాలోని అందమైన లుక్‌ను ఆలియా రీక్రియేట్ చేసారు. రీరిలీజ్ కి ఒక రోజు ముందు మేకర్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేఖతో పాటు టబు, ఆలియా పాల్గొన్నారు. హిందీ భాషా పీరియాడికల్ డ్రామా 4కే లో రీమాస్టర్ చేసిన ప్రింట్ ని 27 జూన్ 2025న రీరిలీజ్ చేసారు.
ఈ వెన్యూకి విచ్చేసిన ఆలియా అందరికీ బిగ్ షాకిచ్చింది. `సిల్సిలా` చిత్రంలో రేఖ పోషించిన చాందిని లుక్ ని ఆలియా గుర్తు చేసింది. ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియా డిజైన్ చేసిన అద్భుతమైన పింక్ చీరలో ఆలియా కనిపించింది. ఈ లుక్‌ను రియా కపూర్ స్టైలింగ్ చేసింది. ఆలియా
అద్భుతమైన ఆభరణాలు, మినిమల్ మేకప్, ఓపెన్ హెయిర్ తో రేఖను తలపించింది ఆలియా. లివింగ్ లెజెండ్ కి నివాళిగా .. మీలాంటి మరొకరు ఎప్పుడూ లేరు... ఎప్పటికీ ఉండరు.. రె-మా`` అని నెటిజన్ రాసారు. మేటి క్లాసిక్ సిల్సిలా చిత్రానికి యష్ చోప్రా దర్శకత్వం వహించారు. రేఖతో పాటు ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ - జయ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా వైరల్ అవుతున్న ఆలియా లుక్ కి రియా కపూర్ డిజైనింగ్ చేసారు.
