Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ మంచి మనసు.. ఆ ఇద్దరికీ సొంత ఇల్లు

ఆలియా భట్‌ అందమైన రూపం కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిత్వంను కలిగి ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 July 2025 4:46 PM IST
హీరోయిన్‌ మంచి మనసు.. ఆ ఇద్దరికీ సొంత ఇల్లు
X

హీరోలు వెండి తెరపై హీరోయిజం పండిస్తారు, వందలాది మందికి సాయం చేస్తారు, వేలాది మందిని కష్టాల నుంచి కాపాడుతారు, కానీ నిజ జీవితంలో చాలా మంది హీరోలు ఇతరుల జీవితాల గురించి అసలు పట్టించుకోరు. ఒకరు ఇద్దరు హీరోలు తమ శక్తి మేరకు సాయం చేయడం మనం చూస్తూ ఉంటాం. కొందరు హీరోలు వారి అభిమానుల చేత సహాయం చేయిస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్స్‌ సైతం చాలా మంది ఇతరుల గురించి కనీసం పట్టించుకోరు. కానీ అతి తక్కువ మంది మాత్రం తమ చుట్టూ ఉన్న వారి కోసం ఎంతో కొంత అయినా సాయం చేయాలని అనుకుంటారు. తన చుట్టూ ఉన్న వారికి సాయం చేయడంలో బాలీవుడ్‌ హీరోయిన్ ఆలియా భట్‌ ముందు ఉంటారు.


ఆలియా భట్‌ అందమైన రూపం కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిత్వంను కలిగి ఉంటుంది. తన చుట్టూ ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి ఆలియా లేదు, కాదు అనకుండా సహాయం చేస్తుందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. తన స్టార్‌డం, తన ఇమేజ్‌కి తగ్గట్లుగానే ఆలియా భట్‌ భారీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుందని అంటారు. ఆలియా ఆ మధ్య ఒకసారి తన కోసం సంవత్సరాలుగా పని చేస్తున్న డ్రైవర్‌, వ్యక్తిగత సహాయకురాలికి ఏకంగా రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసింది. తక్కువ సమయంలోనే ఆలియా భట్‌ స్టార్‌డం దక్కించుకోవడంతో చాలా మంది ఆలియా భట్‌ గురించి కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు.

ఆమె నెపో కిడ్‌ అని, అందుకే బాలీవుడ్‌లో ఆఫర్లు అనే ట్రోల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆమె మాత్రం తన కష్టంతో ఇండస్ట్రీలో స్టార్‌డం దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టడం చాలా ఈజీ. కానీ ఇండస్ట్రీలో స్టార్‌డం దక్కించుకోవడం అంత సులభం కాదు, వారసత్వంగా వచ్చిన వారిలో చాలా మంది ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు. కానీ కష్టపడి పని చేసిన వారు, సొంత ప్రతిభను కనబర్చిన వారు మాత్రమే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలిగారు. అందుకే బాలీవుడ్‌లో ఆలియా భట్‌ అంటే చాలా మంది గౌరవిస్తారు. ఆమె చేసే సహాయ కార్యక్రమాలు ఆమె స్థాయిని మరింతగా పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఆలియా భట్‌ కొన్నాళ్ల క్రితం ఈ సాయం చేసినా కూడా ఇప్పటికీ ఆమె మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆలియా భట్‌ తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఆలియా పాత్ర గురించి చాలా మంది చాలా ఊహించుకున్నారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచే విధంగా ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఉంది, అంతే కాకుండా ఆమె చాలా తక్కువ సమయం కనిపించడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సినిమాలో ఆలియా భట్‌ ఎక్కువ సమయం కనిపించి ఉంటే ఖచ్చితంగా మరో లెవల్‌లో ఆమె ఫ్యాన్స్‌కి కిక్‌ దక్కేది. అంతే కాకుండా ఆలియా భట్‌ కూడా తెలుగులో మరిన్ని సినిమాలు చేసేందుకు గాను ఆసక్తి చూపించేది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆలియా భట్‌ తెలుగులో సినిమాలు ఏమీ చేయడం లేదు. భవిష్యత్తులో చేస్తుందనే నమ్మకం లేదని కొందరు అంటున్నారు.