Begin typing your search above and press return to search.

అనుమ‌తి లేకుండా పొట్టి స్క‌ర్టు వెంట‌ప‌డినందుకు!

అయితే అదే వెన్యూలో భ‌వంతి లోనికి వెళుతున్న‌ప్పుడు త‌న వెంట ప‌డిన మీడియా వ్య‌క్తుల‌ను దూరంగా ఉండాల‌ని చిర్రుబుర్రులాడింది ఆలియా.

By:  Tupaki Desk   |   15 Aug 2025 2:58 PM IST
అనుమ‌తి లేకుండా పొట్టి స్క‌ర్టు వెంట‌ప‌డినందుకు!
X

డిజిటల్- సోష‌ల్ మీడియా యుగంలో ఎవ‌రికీ గోప్య‌త అనేది లేదు. సెల‌బ్రిటీలు సామాన్యులు అంద‌రూ దీనికి బాధితులే. ప్ర‌తిదీ సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాకే తెలుస్తుంది. ఇక సెల‌బ్రిటీలను విసిగించేంత‌గా వెంబ‌డించే వ్య‌క్తుల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇంత‌కుముందు ఆలియా భ‌ట్ పికిల్ బాల్ ఆడుతున్న వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. పొట్టి స్క‌ర్ట్ లో ఆద‌మ‌రిచిపోయి ఆట‌లో నిమ‌గ్న‌మైన ఆలియాను వీడియో తీసి పోస్ట్ చేసారు. నిజానికి త‌న‌ను వీడియో షూట్ చేసి ఇలా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన విష‌యాన్ని ఆలియా ఇప్ప‌టికైనా గ‌మనించిందో లేదో కానీ..

అయితే అదే వెన్యూలో భ‌వంతి లోనికి వెళుతున్న‌ప్పుడు త‌న వెంట ప‌డిన మీడియా వ్య‌క్తుల‌ను దూరంగా ఉండాల‌ని చిర్రుబుర్రులాడింది ఆలియా. ఇలా ఇంట్లోకే వ‌చ్చేయ‌డం స‌రికాదు. దేనికైనా స‌రిహ‌ద్దులు ఉంటాయి! అంటూ త‌న‌ను వెంబ‌డించిన ఫోటోగ్రాఫ‌ర్ల‌ను ఆలియా హెచ్చ‌రిస్తూనే ఉంది. మ్యాడ‌మ్ ప్లీజ్! అంటూనే ఆలియా పొట్టి స్కర్టును ప‌దే ప‌దే ఫోటోలు తీసేందుకు, వీడియోల‌లో నిక్షిప్తం చేసేందుకు చాలా ప్ర‌య‌త్నించారు ఫోటోగ్రాఫ‌ర్లు.

సెల‌బ్రిటీల‌ను ఇలా వెంబ‌డించ‌డం రొటీనే కానీ, ఇలా తిట్లు తిన‌డ‌మే వింత‌. పొట్టి స్క‌ర్టును క్యాప్చుర్ చేసేందుకు దేనికైనా రెడీ అనేస్తున్నారు ఫోటోగ్రాఫ‌ర్లు. అయితే ఎదుటివారికి ఇబ్బంది క‌ల‌గ‌నంత‌వ‌ర‌కూ ఓకే కానీ, ఇబ్బంది ప‌డుతున్నామ‌ని చెప్పినా వెంటాడి ఫోటోలు తీయ‌డం స‌రైన‌దేనా? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. మీడియా నుంచి రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. అయినా ఆలియా ఏం చేసినా లైమ్ లైట్ లో ఉండాలంటే ఇలా వెంబ‌డించేవాళ్లు త‌న‌కంటూ ఉండాలి. బ్ర‌హ్మాస్త్ర త‌ర్వాత ర‌ణ‌బీర్ ని పెళ్లాడిన ఆలియా బిడ్డ‌ను కని పెంచే ప్రాసెస్ లో సినిమాలు చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఆల్ఫా అనే భారీ చిత్రంలో న‌టిస్తోంది. ఇది వైఆర్ఎఫ్ స్పై యూనివ‌ర్శ్ లో భాగం. దీంతో పాటు ల‌వ్ అండ్ వార్ లోను ఆలియా న‌టిస్తోంది.