స్టార్ హీరోయిన్ మూడేళ్ల కష్టం
ఆలియా భట్ గర్భం దాల్చిన సమయంలో అందరి మాదిరిగానే చాలా వెయిట్ పెరిగింది. అప్పటి ఫోటో షూట్‌లను చూస్తే ఆ విషయం గమనించవచ్చు.
By: Tupaki Desk | 10 Aug 2025 5:00 AM ISTఎంత పెద్ద హీరోయిన్స్ అయినా ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలను తగ్గిస్తారు, అందుకు కారణం వారి ఫిజికల్ ఫిట్ కారణం అంటూ చాలా మంది అంటూ ఉంటారు. గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎవరైనా మునుపటి శక్తిని పుంజుకోవడానికి, అంతకు ముందు మాదిరిగా రూపంలోకి మారడానికి చాలా సమయం పడుతుంది. కొందరు హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిన సందర్భాలు ఉన్నాయి. తల్లి అయిన తర్వాత చాలా మంది బరువు విపరీతంగా పెరగడం మనం చూస్తూ ఉంటాం. పెగ్నెన్సీ సమయంలో వెయిట్ పెరిగిన వారు కొందరు తిరిగి తగ్గడం జరగదు. ఒకవేళ బరువు తగ్గినా పూర్తి స్థాయిలో బరువు తగ్గడం జరగదు. కానీ ఆలియా భట్ ఆ రూల్‌ను బ్రేక్ చేసింది.
ఆలియా ప్రెగ్నెన్సీ టైమ్‌లో..!
సాధారణంగా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో హీరోయిన్స్ పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించరు. కానీ ఆలియా భట్ పెళ్లి చేసుకోవడంతో పాటు, వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆలియా భట్ వరుసగా సినిమాలు చేస్తూ మునుపటి ఉత్సాహంతో దూసుకు పోతుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉంటే ఆలియా భట్ మాత్రమే ప్రెగ్నెన్సీ తర్వాత ఈ స్థాయిలో అందంగా కనిపిస్తుందని ఆమె ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఆలియా భట్ అందంతో పాటు తన ఫిజిక్‌తో ఎక్కువగా జనాలకు నచ్చుతుంది. అందుకే ఆమె తన ఫిజిక్ విషయంలో ప్రెగ్నెంట్ సమయంలో, ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిందట. అందుకే ఇప్పుడు మునుపటి అందంతో ఆలియా చాలా చక్కగా కనిపిస్తుంది.
కఠినమైన వర్కౌట్స్, డైట్‌తోనే సాధ్యం
ఆలియా భట్ గర్భం దాల్చిన సమయంలో అందరి మాదిరిగానే చాలా వెయిట్ పెరిగింది. అప్పటి ఫోటో షూట్‌లను చూస్తే ఆ విషయం గమనించవచ్చు. జాతీయ మీడియా కథనాల అనుసారం ఆలియా గర్భం దాల్చిన తర్వాత దాదాపుగా 30 కేజీలకు పైగానే వెయిట్ పెరిగింది. ఆ మొత్తం వెయిట్ ను పూర్తిగా తగ్గించుకోవడం అంత సులభమైన విషయం కాదని అంతా అనుకున్నారు. కానీ ఆలియా కఠినమైన వర్కౌట్స్, డైట్ కారణంగా ఆ వెయిట్ తగ్గింది. బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని వారాల్లోనే ఆలియా కఠినమైన వర్కౌట్స్ మొదలు పెట్టింది అని ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందుకే ఆమె ఇన్నాళ్లకు తన పూర్వపు రూపం కు వచ్చిందని ఆమె సన్నిహితులతో పాటు, ఆమెకు వ్యక్తిగతంగా జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చే సోహ్రాబ్ ఖుష్రుషాహి చెప్పుకొచ్చాడు.
సోహ్రాబ్ ఖుష్రుషాహి మాట్లాడుతూ..
ఇటీవల సోహ్రాబ్ ఖుష్రుషాహి ఒక సందర్భంగా మాట్లాడుతూ... ఆలియా పోస్ట్ ప్రెగ్నెన్సీ వర్కౌట్స్ గురించి, ఆమె తీసుకున్న ఫుడ్ గురించి చెప్పుకొచ్చాడు. డెలివరీ అయిన వెంటనే ఆలియా రోజు 15 నిమిషాల నడక మొదలు పెట్టింది. అలాగే శ్వాసకు సంబంధించిన ఆసనాలు చేసింది, యోగా చేయడం ద్వారా కూడా ఆలియా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నం చేసింది. ఆలియా వ్యాయామాలతోనే తన పూర్వపు రూపంకు రాలేదు. ఆమె రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లో తాజా పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్ ఉండేలా చూసుకుంది. వాటిని రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల పోస్ట్ ప్రెగ్నెన్సీ లో ఈ ఫిజిక్ సాధించగలిగింది. ఆలియా భట్ దాదాపుగా మూడు ఏళ్ల పాటు కష్టపడటం వల్లే బిడ్డ జన్మించిన తర్వాత పూర్వ స్థితికి ఆలియా వచ్చిందని ఆమె జిమ్ ట్రైనర్ పేర్కొన్నాడు.
