హ్యాట్రిక్ మాత్రం కొట్టనంటోన్న హీరోయిన్!
అలియాభట్ నటిస్తూ నిర్మించిన చిత్రమిది. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమాతో నష్టాలొచ్చాయి.
By: Tupaki Desk | 11 Feb 2026 2:00 PM ISTబాలీవుడ్ లో అలియాభట్ కెరీర్ ఎలా సాగుతోంది అన్నది అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. సీనియర్ భామల నుంచి ఎంత పోటీ ఉన్నా? వాళ్లందర్నీ దాటుకుని మరీ అవకాశాలు అందుకుంటోంది. ఇంకా చెప్పాలంటే వాళ్లను మించిన సక్సెస్ ను అలియాభట్ చూస్తోంది అన్నది కాదనలేని నిజం. కెరీర్ పీక్స్ లో ఉండగానే లవ్ , ఫ్యామిలీ జీవితానికే అంతే ప్రాధాన్యతనిచ్చింది. రణబీర్ కపూర్తో ప్రేమ వివాహం..పిల్లల విషయంలో? డిలే లేకుండా మామ్ గా మారడం అన్నీ అలియాభట్ జీవితంలో చాలా వేగంగా జరిగిపోయాయి.
జీవితాన్ని సక్రమంగా ప్లాన్ చేసుకుంటే? ఇంత అదంగా ఉంటుందా? అని అలియాభట్ ను చూసినప్పుడల్లా? సహ చర భామలు అనుకుంటారు. నటిగా ప్రయోగాలకు ఎంత మాత్రం వెనుకాడని నటి అలియాభట్. కమర్శియల్ చిత్రాలైనా సోలో నాయికగా సత్తా చాటాలన్నా? ధైర్యంగా అడుగులు వేస్తుంది. ఈ లక్షణాలే అమ్మడిని మిగతా భామల నుంచి వేరు చేస్తోంది అన్నది అంతే వాస్తవం. యశ్ రాజ్ లాంటి ప్రతిష్టాత్మ నిర్మాణ సంస్థ `ఆల్పా` లాంటి స్పై చిత్రాన్ని అలియాభట్ తోనే తెరకెక్కిస్తున్నారంటే? తానెంత ప్రత్యేకమో మరోసారి తేట తేల్లమవుతోంది.
అలాగే `డార్లింగ్స్` చిత్రంతో అలియాభట్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అలియాభట్ నటిస్తూ నిర్మించిన చిత్రమిది. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమాతో నష్టాలొచ్చాయి. అయినా అలియా ఎంత మాత్రం వెనకడుగు వేయలేదు. రెండేళ్ల గ్యాప్ లోనే `జిగ్రా` అంటూ మరో ప్రయోగం చేసింది. ఈ సినిమా `డార్లింగ్స్` ను మించి నష్టాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడైనా వెనక్కి తగ్గుతుందా? అంటే నో వే అనేస్తోంది. బాలయ్య సినిమాలో డైలాగ్ లో నరికే కొద్ది బాలయ్యకు ఊపు వస్తే ప్లాప్ లు ఎదురయ్యే కొద్ది అనుభవం నుంచి ఓ గొప్ప సక్సెస్ వస్తుందన్నది అలియా భట్ బలంగా నమ్మి ముందుకెళ్తోంది.
హ్యాట్రిక్ ప్లాప్ కి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వనంటోంది. తర్వాత తానే సినిమా నిర్మించిన హిట్ ఇచ్చి కొత్త చరిత్ర రాస్తానంటోంది. ఇంత వరకూ రెండు వైఫల్యాల నుంచి చాలా విషయాలు తెలుసుకున్నానని, నిర్మాతల ఇబ్బం దులు కూడా ఎలా ఉంటాయి? అన్నది రెండు ప్లాప్ లతో తనకు బాగా అర్దమైందంది. కొత్త ఏడాదిలో మరో కొత్త సినిమా కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని కథలు విన్నా? అవేవి తనకు సంతృప్తిని వ్వలేదంది.
రెగ్యులర్ స్టోరీలకు భిన్నంగా చిత్రాలు నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అలియాభట్ `ఆల్ఫా`లో నటిస్తోంది. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడుతోంది. అలాగే `లవ్ అండ్ వార్` లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందకు రాబోతున్న చిత్రాలివి.
