Begin typing your search above and press return to search.

నేను చేయలేనేమో.. ఆలియా భావోద్వేగం

ఆలియా భట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాడ్‌ను పట్టుకుని వేలాడుతున్న వీడియోను షేర్ చేసి... నేను ఇప్పుడు చేయగలనో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అప్పుడు మాత్రం చేయగలిగాను.

By:  Tupaki Desk   |   17 April 2025 9:55 PM IST
నేను చేయలేనేమో.. ఆలియా భావోద్వేగం
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ పెళ్లి, పిల్లల తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది. అంతే కాకుండా పెళ్లికి ముందు తో పోల్చితే ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి ప్రాజెక్ట్‌కి పది కోట్లకు తగ్గకుండా ఆలియా పారితోషికం అందుకుంటుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఆలియా భట్‌ తన ఫిజిక్‌ను బ్యాలన్స్ చేయడం కోసం, ఎప్పుడూ సన్నగా నాజూకుగా కనిపించడం కోసం చాలా కష్టపడుతుంది. గతంలో ఆలియా భట్ జిమ్‌లో వర్కౌట్‌ చేసిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే.

చూడ్డానికి సన్నగా నాజూకుగా కనిపించే ఆలియా భట్‌ జిమ్‌లో పడే కష్టం చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. బాబోయ్ మరీ ఇంత కష్టమైన వర్కౌట్స్ అవసరమా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చూడటానికి సన్నగా ఉన్నా మీరు ఎందుకు ఇంతలా కష్టపడుతారు అంటూ చాలా మంది ఆమెను ప్రశ్నిస్తారు. మొత్తానికి రకరకాలుగా ఆమెను సోషల్‌ మీడియా ద్వారా వర్కౌట్స్ గురించి ప్రశ్నించడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆలియా భట్‌ మరోసారి తన వర్కౌట్‌ వీడియోను షేర్ చేసింది. అయితే ఆ వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్‌ను షేర్ చేసింది. ఆ పాత వీడియోకు ఆలియా జత చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

ఆలియా భట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాడ్‌ను పట్టుకుని వేలాడుతున్న వీడియోను షేర్ చేసి... నేను ఇప్పుడు చేయగలనో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అప్పుడు మాత్రం చేయగలిగాను. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే భావోద్వేగానికి గురి అవుతున్నాను అంది. ఆడవారు సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతకు ముందు మాదిరిగా ఫిజికల్‌గా ఉండలేరు. అందుకే గతంలో మాదిరిగా తాను అలా చేయలేనేమో అంటూ ఆలియా భావోద్వేగానికి గురి అవుతున్నట్లు పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆలియా షేర్‌ చేసిన వీడియోకు పలువురు హీరోయిన్స్ స్పందించారు. లక్షలాది మంది ఆమె వీడియోకు లైక్ చేశారు.

ప్రస్తుతం ఆలియా రెండు భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈమె రణబీర్‌ కపూర్‌తో కలిసి నటిస్తున్న 'లవ్‌ అండ్‌ వార్‌' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు, ఛావా హీరో విక్కీ కౌశల్‌ సైతం నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ ఆ సినిమాను రూపొందిస్తున్నారు. మరో వైపు ఆలియా ఆల్ఫా అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమాకు కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.