Begin typing your search above and press return to search.

గూచీ బ్రాండ్‌కి సిత‌క్కొట్టిన ఆలియా

ఇక తన ఫ్యాషన్ గేమ్‌ను 2వ రోజు గూచీ- లోరియ‌ల్ ప్యారిస్ బ్రాండ్‌తో మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. గూచీ బ్రాండ్ డిజైన‌ర్ దుస్తుల్లో ఆలియా జాలీగా రెడ్ కార్పెట్‌పై నడిచింది.

By:  Tupaki Desk   |   25 May 2025 9:13 AM IST
గూచీ బ్రాండ్‌కి సిత‌క్కొట్టిన ఆలియా
X

కేన్స్ 2025లో అలియా భట్ సంద‌డి ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ఈ ఉత్స‌వాల్లో క‌ళ్ల‌న్నీ అలియాపైనే. ఫ్యాష‌న్ ప్ర‌పంచ‌పు రాణులు కొలువుదీరిన చోట‌ భట్ క్యాంప్ క్యూట్ గాళ్ దుమ్ము దులిపేస్తోంది. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల డిజైన‌ర్ లుక్స్ లో ఆలియా దుమారం రేపింది. ఇత‌ర క‌థానాయిక‌ల‌తో పోలిస్తే ఆలియా బోల్డ్ ఎంపిక‌లు నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఆరంభం సాదా సీదాగా ఉన్న డిజైన‌ర్ డ్రెస్ లో రొటీన్ గా క‌నిపించినా కానీ, ఆ త‌ర్వాత ఆలిలా ఒక్క‌సారిగా దూకుడు పెంచేసింది.

ఇక తన ఫ్యాషన్ గేమ్‌ను 2వ రోజు గూచీ- లోరియ‌ల్ ప్యారిస్ బ్రాండ్‌తో మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. గూచీ బ్రాండ్ డిజైన‌ర్ దుస్తుల్లో ఆలియా జాలీగా రెడ్ కార్పెట్‌పై నడిచింది. నటి రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన గూచ్చి డిజైన్ చేసిన పసుపు రంగు ఫ్రాక్ ను ధరించింది. ఈ కొత్త‌ లుక్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

ఈ లుక్ లో ఆలియా అంద‌చందాలు, మేకప్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. కేన్స్ లో రెండో రోజు ఆలియా లుక్ దుమ్ము దులిపేసింది అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇది అద్భుత రూపం అంటూ ఒక అభిమాని ఫిదా అయిపోయాడు.

కేన్స్ 2025లో అలియా భట్ 2వ రోజు రెండు వెరైటీ దుస్తుల్లో క‌నిపించింది. వాటిలో ఒక‌టి నెట్టెడ్ సిల్వర్ - న్యూడ్-టోన్డ్ చీరలో రెడ్ కార్పెట్ పై వాక్ చేసింది. బ్లౌజ్‌కి నెక్‌లైన్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఈ డిజైన‌ర్ లుక్ కోసం డైమండ్ నెక్లెస్ ని కూడా ఆలియా ధ‌రించింది. కేన్స్ సంబ‌రాలు ముగించిన త‌ర్వాత ఆలియా త‌న త‌దుప‌రి చిత్రం ఆల్ఫా పై దృష్టి సారిస్తుంది. భ‌న్సాలీ `ల‌వ్ అండ్ వార్` ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో ర‌ణ‌బీర్, విక్కీ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.