Begin typing your search above and press return to search.

ఆలియా కేన్స్ ఆరంగేట్రం రెస్పాన్స్ ఇదీ

ఎట్ట‌కేల‌కు ఆలియా భ‌ట్ ఫ్రెంచ్ రివేరా వేదిక‌గా జ‌రుగుతున్న‌ కేన్స్ ఉత్స‌వాల్లో పాల్గొంది. ఈ వేడుక‌ల్లో ఆలియా ధ‌రించిన ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ దుస్తులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

By:  Tupaki Desk   |   24 May 2025 3:45 PM IST
ఆలియా కేన్స్ ఆరంగేట్రం రెస్పాన్స్ ఇదీ
X

ఇండియా- పాక్ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ఆలియా భ‌ట్ కేన్స్ 2025 ఆరంగేట్రాన్ని వాయిదా వేసుకుంద‌ని ప్ర‌చారం సాగింది. కేన్స్ లో మొద‌టి రోజే ఆలియా అడుగుపెట్టాల్సింది... కానీ అది జ‌ర‌గ‌లేదు. దానికి కార‌ణం భార‌త్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధ వాతావ‌ర‌ణం.. అంటూ ప్ర‌చారం సాగింది. ఎట్ట‌కేల‌కు ఆలియా భ‌ట్ ఫ్రెంచ్ రివేరా వేదిక‌గా జ‌రుగుతున్న‌ కేన్స్ ఉత్స‌వాల్లో పాల్గొంది. ఈ వేడుక‌ల్లో ఆలియా ధ‌రించిన ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ దుస్తులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.


కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలిసారి ఆరంగేట్రం చేస్తున్న ఆలియా ఆర్గాన్జా ఎనామెల్ ఫ్లోర‌ల్ ఐవరీ రఫ్ఫ్ల్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన ఆఫ్-షోల్డర్ బస్టియర్ గౌనులో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ లుక్ చాలా మందిని ఆక‌ర్షించినా కానీ, 2017 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మల్లికా షెరావత్ మెర్మైడ్ గౌనును ఇమ్మిటేట్ చేసింద‌ని నెటిజనులు గుర్తు చేశాయి. కేన్స్ లో మ‌ల్లిక చాలా సీనియ‌ర్. కొన్నేళ్ల పాటు రెడ్ కార్పెట్ లుక్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారగలిగింది.


2017లో మల్లిక పింక్ క‌ల‌ర్ అద్దిన‌, లేత గోధుమరంగు జార్జెస్ హోబెకా ఆఫ్-షోల్డర్ మెర్మైడ్ గౌనులో ఇండియ‌న్ క్వీన్ లా కనిపించింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆలియా లుక్ దానిని గుర్తు చేసింద‌ని నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆలియా ఆరంభ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కానీ ఆలియా త‌న‌ మేకప్ , హెయిర్ డిజైన్ ఎంపికతో కొంత‌ నిరాశప‌రిచింద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ, ఈ దుస్తులు చాలా అందంగా ఉన్నాయి అని ప్ర‌శంసించారు.


ఆలియా న‌టిస్తున్న స్పై మూవీ ఆల్ఫా విడుద‌ల కావాల్సి ఉంది. ఇందులో శార్వరి కూడా న‌టిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ లవ్ & వార్‌లోను ఆలియా నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.