RRR సీత అడల్ట్ సిరీస్‌తో తప్పు చేస్తోందా?
కేవలం నటిగానే కాదు ఎంటర్ ప్రెన్యూర్ గాను ఆలియా భట్ ప్రణాళికలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
By: Tupaki Desk | 9 April 2025 4:25 PMకేవలం నటిగానే కాదు ఎంటర్ ప్రెన్యూర్ గాను ఆలియా భట్ ప్రణాళికలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తన సంపాదనను తెలివిగా వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ భారీ లాభాల్ని ఆర్జిస్తోంది. మరోవైపు సినీనిర్మాతగాను ఆలియా విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇంతకుముందు షారూఖ్ తో కలిసి డార్లింగ్స్ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా విజయం సాధించింది. ఇటీవల జిగ్రా అనే చిత్రాన్ని నిర్మించినా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
ఆలియా ఇకపైనా సినీనిర్మాణంలో సీరియస్ గా ముందుకు సాగుతోంది. తాజా సమాచారం మేరకు.. అలియా భట్ పూర్తిగా కొత్తవారితో అడల్ట్ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేదానిపై స్పష్ఠత లేదు. అడల్ట్ సిరీస్ కథ, కాన్సెప్ట్ విన్న తర్వాత ఆలియా నో చెప్పలేకపోయారట. అయితే ఈ సిరీస్ లో బో* కంటెంట్ ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో సీతగా నటించిన ఆలియాకు సౌత్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కానీ అందుకు విరుద్ధమైన కంటెంట్ ని ఆలియా ప్రోత్సహించడం ఆశ్చర్యకరమే.
డార్లింగ్స్, జిగ్రా తర్వాత ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతగా మరో అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ కంటెంట్ పరంగా ఎలాంటి విమర్శల్ని అయినా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆలియా నటిగాను తన కెరీర్ పైనా ఫోకస్ చేసింది. తదుపరి శివ్ రావైల్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ డ్రామా `ఆల్ఫా`లో నటిస్తోంది. భారతీయ తెరపై లేడీ స్పై విన్యాసాలు వీక్షించేందుకు అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.