Begin typing your search above and press return to search.

అస‌లు మ‌మ్మీ అని ఎవ‌రైనా అనుకుంటారా?

ఆలియా భ‌ట్ ఒక బిడ్డ‌కు మ‌మ్మీ.. కానీ ఈ వీడియో చూశాక అభిప్రాయం మార్చుకోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 1:56 AM IST
అస‌లు మ‌మ్మీ అని ఎవ‌రైనా అనుకుంటారా?
X

ఆలియా భ‌ట్ ఒక బిడ్డ‌కు మ‌మ్మీ.. కానీ ఈ వీడియో చూశాక అభిప్రాయం మార్చుకోవాల్సి ఉంటుంది. మ‌న క‌ళ్ల‌ను న‌మ్మ‌లేనంత‌గా ఇంత ప‌ర్ఫెక్ట్ ఫిట్ గా మార‌డానికి ఆలియా ఏం చేస్తోందో కానీ..ఇది అంద‌రికీ స్ఫూర్తి! క‌చ్ఛితంగా జిమ్ లో వ‌ర్క‌వుట్ల‌తో ఇలాంటి మేకోవ‌ర్ సాధించింద‌ని చెప్పొచ్చు. నిరంత‌రం డైట్ ప్లానింగ్, జిమ్ తో దీనిని సాధించింది.

ప్ర‌స్తుతం ఆలియా `ఆల్ఫా` అనే లేడీ స్పై మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాలో గూఢచారిగా దుమ్ము దులుపుతుంది. ఫైట్స్ అడ్వెంచ‌ర్స్ ప‌రంగా ఆలియా పూర్తిగా యాక్ష‌న్ మోడ్ లో క‌నిపించ‌నుంది. దీనికోస‌మే ఆలియా ఇలా త‌న రూపాన్ని మార్చుకునేందుకు చాలా శ్ర‌ద్ధ క‌నబ‌రిచింది. ర‌ణ‌బీర్ ని పెళ్లాడి, రాహా క‌పూర్ కు మామ్ అయింది ఆలియా. కానీ మ‌మ్ షేడ్స్ త‌న‌లో అస్స‌లు క‌నిపించ‌నే లేదు. తాజాగా ఆల్ఫా లో ఒక పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ బ‌య‌ట‌కు వెళుతున్న‌ప్ప‌టి వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. పూర్తిగా బాడీ ఫిట్ ట్రాక్ సూట్ ధ‌రించిన ఆలియా ఎంతో యంగ్ గా టీనేజ‌ర్ ని త‌ల‌పించింది. త‌న‌ను చూడ‌గానే అస‌లు ఈమె మ‌మ్మీనా? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆస‌క్తిక‌రంగా త‌న‌తో క‌లిసి ప‌ని చేస్తున్న అంద‌గ‌త్తె, ఫిట్నెస్ ఫ్రీక్ శార్వ‌రి వాఘ్ కి మ్యారీడ్ ఆలియా ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తోంది.

ఆలియా భట్ - శార్వరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ తొలి మ‌హిళా YRF స్పై యూనివర్స్ చిత్రం `ఆల్ఫా`ను అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అంద‌గ‌త్తెల స్టంట్స్ తో పాటు డ్యాన్స్ నంబ‌ర్ మైండ్ బ్లో చేస్తుంద‌ని చెబుతున్నారు. ఆల్ఫా చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ గ్లోబల్ స్ట్రీమింగ్ సిరీస్ ది రైల్వే మెన్ తో అత‌డికి గొప్ప గుర్తింపు ద‌క్కింది. దీనిని కూడా య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది.