నజ్రియా భర్తని అలియా అంతగా ఆరాదిస్తుందా!
ఎంత పెద్ద హీరోయిన్ అయినా? అభిమాన హీరో అంటూ ఒకరుంటారు. వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంటారు.
By: Tupaki Desk | 28 May 2025 12:20 PM ISTఎంత పెద్ద హీరోయిన్ అయినా? అభిమాన హీరో అంటూ ఒకరుంటారు. వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి అలా అభిమానించే స్టార్ తనకన్నా చిన్న పరిశ్రమ నుంచైనా అవ్వొచ్చు. అభిమానానికి...ఆరాధించడానికి ఇండస్ట్రీతో పనేముంటుంది? అక్కడ కేవలం ప్రతిభ మాత్రమే కొలమానం. అలాంటి అభిమానాన్నే చూపిస్తోంది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఓ మాలీవుడ్ నటుడిపై.
అతడు ఎవరో కాదు పహాద్ పాజిల్. ఇతడు ఎంతటి ప్రతిభావంతుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటనలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉన్న నటుడు. వైవిథ్యమైన నటనతో ప్రేకుకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. 'పుష్ప' సినిమాతో తెలుగులోనూ బాగా ఫేమస్ అయ్యాడు. బన్వర్ సింగ్ షెకావత్ అనే పాత్ర పేరు అతడికి మరో పేరులా మారిపోయింది. మాలీవుడ్ లో చాలా గొప్ప నటుడిగా పేరుంది.
నటి నజ్రీయా నజీమ్ భర్త కూడా. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదే నటుడిని అలియా ఎంతగా ఆరాదిస్తుంది? అన్నది రివీల్ చేసింది. 'ఫహాద్ నిజంగా నేను అరాధించే నటుడు. చాలా గొప్ప నటుడిగా భావిస్తాను. ఆన నటించిన చిత్రాల్లో 'ఆవేశం' బాగా ఇష్టం. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషిస్తారు. ఆయన నటనలో ఏదో తెలియని శక్తి కనిపిస్తుంది. అతడితో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.
ఇప్పుడంతా భాషతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. ప్రేక్షకులు అలాగే ఆదరిస్తున్నారు. పరిశ్రమలన్ని ఒకే తాటిపైకి వచ్చి పని చేయడం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపింది. ప్రస్తుతం అలియా భట్ 'లవ్ అండ్ వార్' లో నటిస్తోంది. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉండి. అలియా భట్ 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
