ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం
జులై 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.
By: Tupaki Desk | 10 July 2025 4:00 AM ISTసినీ నటుడు, కమెడియన్ అలీ అంతకు ముందులా ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలతో సందడి చేసిన ఆయన ఇప్పుడు ఏదో అప్పడప్పుడు మాత్రమే కనిపించి సందడి చేస్తున్నారు. తాజాగా సుహాస్ హీరోగా జో ఫేమ్ మాళవిక మనోజ్ హీరోయిన్ గా వస్తున్న ఓ భామ అయ్యో రామా సినిమాలో అలీ ఓ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించారు.
జులై 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న అలీ ఈ మూవీలో తన పాత్రకు ఆడియన్స్ అంతా ఎమోషనల్ అవుతారని తెలిపారు. సినిమాలో సుహాస్‌కు, తనకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని సుహాస్ కూడా ప్రమోషన్స్ లో పదే పదే చెప్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ, హీరోయిన్ మాళవిక మనోజ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాళవిక వయసు 18 ఏళ్లేనని, సినిమా రిలీజయ్యాక ఆమెకు ఎవరు కర్ఛీఫ్ వేస్తారో చెప్పలేమని, హీరోయిన్ స్క్రీన్ పై చాలా అందంగా ఉందని చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారని, ఇలానే తాను చాలా మంది హీరోయిన్లని చూస్తూ వచ్చానని అలీ అన్నారు.
సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క కూడా మాళవిక లానే చాలా సైలెంట్ గా ఉండేదని, కానీ కట్ చేస్తే తర్వాత అరుంధతి సినిమా చేసిందని, ఆ సినిమా చూసి తానెంతో భయపడ్డానని, అప్పుడు సూపర్ లో చూసిన అనుష్కనేనా అనుకున్నానని, అందుకే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏక్కడ ఏమవుతుందో తెలియదని, ఏ పుట్టలో ఏ పాముందో, ఏం జరుగుతుందో, ఎవరెప్పుడు టాప్ పొజిషన్ కు వెళ్తారో ఎవరూ చెప్పలేమని అలీ పేర్కొన్నారు.
