Begin typing your search above and press return to search.

అలేఖ్య పికిల్స్ ఇష్యూ.. అత్తమ్మాస్ కిచెన్ రేట్స్ వైరల్..

ప్రస్తుతం అత్తమ్మాస్ కిచెన్ వెబ్ సైట్ లో మూడు పులిహోర పేస్ట్ ప్యాకెట్లు రూ.1170కు.. ఐదు రసం పౌడర్ ప్యాకెట్స్ రూ.1185కు.. ఉప్మా మిక్స్ ప్యాకెట్స్ 5 కాంబో రూ.1175కు..

By:  Tupaki Desk   |   6 April 2025 1:06 PM IST
అలేఖ్య పికిల్స్ ఇష్యూ.. అత్తమ్మాస్ కిచెన్ రేట్స్ వైరల్..
X

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ ఫుల్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నెట్టింట ఎక్కడ చూసినా ఆ విషయంపై చర్చ నడుస్తోంది. అసభ్యకరమైన పదాలతో ఓ కస్టమర్ కు అలేఖ్య పెట్టిన వాయిస్ మెసేజ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. దీంతో నెటిజన్లు, కస్టమర్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అలేఖ్య, సుమ, రమ్య.. నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ తో ఫుల్ ఫేమస్ అయ్యారు. పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్లకు ప్రసిద్ధి గాంచిన వారు.. ఇన్ స్టా, యూట్యూబ్ లో బిజినెస్ ప్రమోట్ చేసుకుని క్రేజ్ సంపాదించారు. కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయని అడిగిన వారిని తిట్టి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు.

దీంతో బూతులు విని ఒళ్ళు మండిన కస్టమర్.. సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫుల్ వైర్ అయింది. అలా ట్రోల్స్, విమర్శలు భారీ స్థాయిలో రావడంతో తమ పికిల్స్ బిజినెస్ వెబ్ సైట్ ను క్లోజ్ చేసి.. వాట్సాప్ అకౌంట్ ని డిలీట్ చేశారు. అయినా నెటిజన్లు సైలెంట్ అవ్వలేదు. రీసెంట్ గా క్షమాపణలు కూడా చెప్పారు అలేఖ్య సిస్టర్స్.

ఏదైనా రేట్ కోసం అడిగిన కస్టమర్ కు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల బిజినెస్ కు పెద్ద దెబ్బ పడిందని చెప్పాలి. అదే సమయంలో ఇప్పుడు అత్తమ్మాస్ కిచెన్ రేట్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ ను ఉపాసన గతేడాది స్టార్ట్ చేశారు.

ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా బిజినెస్ మొదలుపెట్టినట్లు మెగా కోడలు ఇప్పటికే తెలిపారు. వ్యాపారంలో భాగంగా పొంగల్ మిక్స్, పులిహోర పేస్ట్, ఉప్మా మిక్స్ తో పాటుగా రసం పౌడర్ రెసిపీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే నాలుగు ప్యాకెట్స్ ఒక్కొక్కటి చొప్పున కాంబోలో తీసుకుంటే వెయ్యి రూపాయలకు పైగా ధర ఉంటుంది.

ప్రస్తుతం అత్తమ్మాస్ కిచెన్ వెబ్ సైట్ లో మూడు పులిహోర పేస్ట్ ప్యాకెట్లు రూ.1170కు.. ఐదు రసం పౌడర్ ప్యాకెట్స్ రూ.1185కు.. ఉప్మా మిక్స్ ప్యాకెట్స్ 5 కాంబో రూ.1175కు.. 5 పొంగల్ మిక్స్ ప్యాక్స్ రూ.1185కు విక్రయిస్తున్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు.