Begin typing your search above and press return to search.

ఈవెంట్స్, ప్రమోషన్స్ చేసి.. చివరికి ఓటీటీలో..

రెండు వెంట వెంట వారాల్లో ఒక భాషలో ఒక సినిమా మరో భాషలో మరో సినిమా రిలీజ్ చేయడం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వల్లే అయ్యిందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 6:08 AM GMT
ఈవెంట్స్, ప్రమోషన్స్ చేసి.. చివరికి ఓటీటీలో..
X

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి తమిళ మేడిన్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు. కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం లీడ్ రోల్ లో వడక్కుపత్తి రామస్వామి టైటిల్ తో లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోల పక్క కమెడియన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంతానం ఈమధ్య సోలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు.

కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో అలరిస్తున్న సంతానం తన మార్క్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా వడక్కుపత్తి రామస్వామి సినిమాలో కూడా సంతానం మెప్పించారు. కార్తీక్ యోగి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతో పీపుల్ మీడియా తమిళ ఫస్ట్ మూవీ సక్సెస్ అయ్యింది. తెలుగు నిర్మాతలు తమిళ్ లో సక్సెస్ సాధించడం చాలా అరుదు. అది కూడా అక్కడ స్టార్స్ ని పెట్టి సినిమాలు చేయడం ప్రత్యేకంగా అనిపిస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో స్టార్స్ తో పాటుగా యువ హీరోలతో కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఇదే ప్లాన్ ని కోలీవుడ్ లో కూడా అప్లై చేయబోతుంది. అక్కడ కూడా సంతానం తో మొదలు పెట్టిన వారి ప్రొడక్షన్ సినిమాలు పెద్ద స్టార్స్ తో కూడా చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే తమిళంలో చేసిన ఫస్ట్ సినిమాతోనే హిట్టు ఖాతా తెరిచారు.

తెలుగులో ఈ వీకెండ్ ఈగల్ సినిమాతో వస్తున్నారు ఈ నిర్మాతలు. రెండు వెంట వెంట వారాల్లో ఒక భాషలో ఒక సినిమా మరో భాషలో మరో సినిమా రిలీజ్ చేయడం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వల్లే అయ్యిందని చెప్పొచ్చు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో నెలకో సినిమా.. ప్రస్తుతం 40 సినిమాల దాకా ప్రొడక్షన్ లో ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చారు నిర్మాత టి జి విశ్వ ప్రసాద్. మొత్తానికి పీపుల్ మీడియా తెలుగుతో పాటుగా తమిళంలో కూడా పాగా వేయాలని చూస్తున్నారని చెప్పొచ్చు.

ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్న పీపుల్ మీడియా స్టార్స్ నుంచి మీడియం రేంజ్ ఇంకా యువ హీరోలు ఇలా అందరితో సినిమాలు చేస్తున్నారని తెలుస్తుంది. దశాబ్దాల కాలంగా ఉన్న భారీ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఇలా 40 సినిమాలు ప్రొడక్షన్ లో ఉండేలా చేయడం జరగలేదు. చూస్తుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల ప్లాన్ చాలా పెద్దగానే ఉందని అనిపిస్తుంది.