Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స్టార్ కిడ్ రిసార్ట్‌వేర్ దుమ్ము దుమారం

తాజాగా హార్ప‌ర్ బాజ‌ర్ ఇండియా క‌వ‌ర్ పేజీపై ఈ బ్యూటీ ఫోజులు యువ‌త‌రంలో గుబులు రేపుతున్నాయి. ఆల‌య సింపుల్ డిజైన‌ర్ షార్ట్.. దానికి కాంబినేష‌న్ టాప్ ని ధ‌రించింది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 11:30 PM GMT
ఫోటో స్టోరి: స్టార్ కిడ్ రిసార్ట్‌వేర్ దుమ్ము దుమారం
X

వెట‌ర‌న్ బ్యూటీ పూజా భేడీ న‌ట‌వార‌సురాలిగా సినీరంగంలో ప్ర‌వేశించిన ఆల‌య ఎఫ్ నటించిన కొద్ది సినిమాల‌తోనే తానేంటో నిరూపించింది. ప్ర‌తిసారీ ఒక‌దానికొక‌టి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్ని ఎంపిక చేసుకుని న‌టిగా స‌త్తా చాటింది. అందుకే న‌ట‌వార‌సురాళ్ల వెల్లువ ఎంత‌గా ఉన్నా ఆల‌య పేరు బాలీవుడ్ లో మార్మోగుతోంది. న‌ట‌వార‌సురాలు యూనిక్ పెర్ఫామెన్సెస్ తో త‌న‌కంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకోగ‌లిగింది. ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ఆల‌య ఎఫ్ ప్ర‌చార‌క‌ర్త‌గాను అవ‌కాశాలు అందుకుంది. నేటిత‌రంలో ప్రామిస్సింగ్ హీరోయిన్ గా ఆల‌య‌కు గ్రౌండ్ సెటిలైంది.


తాజాగా హార్ప‌ర్ బాజ‌ర్ ఇండియా క‌వ‌ర్ పేజీపై ఈ బ్యూటీ ఫోజులు యువ‌త‌రంలో గుబులు రేపుతున్నాయి. ఆల‌య సింపుల్ డిజైన‌ర్ షార్ట్.. దానికి కాంబినేష‌న్ టాప్ ని ధ‌రించింది. ఈ లుక్ సంథింగ్ స్పెష‌ల్ అన‌డంలో సందేహం లేదు. రొటీన్ బికినీల‌తో పోలిస్తే ఇది బీచ్ ఫోటోషూట్ల‌లో విభిన్న‌మైన శైలి. 'సౌకర్యం - శైలి తాలూకా ప్రాక్టికాలిటీకి మించి, మీ ప్రయాణంలో వస్త్రధారణ మీ అనుభవాలను ప్రతిబింబిస్తుంది. రిసార్ట్ దుస్తులు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని స్వీకరించడం కంటే ఈ కథలను వివరించడానికి మంచి మార్గం ఏం ఉంది?' అంటూ అంద‌మైన వ్యాఖ్య‌ను జోడించింది. మీ తదుపరి విహారయాత్ర కోసం ప్యాక్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ రిసార్ట్‌వేర్ ట్రెండ్‌ల గురించి తెలుసుకోవడానికి బయోలో వెత‌కండి! అంటూ వెల్ల‌డించింది. #HarpersBazaarIndia #BazaarIndia ట్యాగ్స్ ని జోడించింది.

ఆల‌య ఎఫ్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ 'స్టార్ కిడ్‌గా ఉండటం వ‌ల్ల కూడా ప్రతికూలతలు ఉన్నాయి' అని అంది. ప్ర‌ముఖ న‌టి కుమార్తెగా కెరీర్ ప‌రంగా నా పని మరింత కష్టతరం అయింద‌ని బంధుప్రీతిపై త‌న‌ ఆలోచనలను పంచుకుంది. జవానీ జానేమాన్, ఫ్రెడ్డీ, ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబ్బత్, U-టర్న్ చిత్రాల్లో న‌టించిన అలయ ఎఫ్ ప్ర‌తిసారీ విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంది. అన్నిటా విస్తృతమైన నటనా నైపుణ్యాలను ప్ర‌ద‌ర్శించింది. అందుకే ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీని తెరపై చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. నటిగానే కాకుండా అలయ ఎఫ్ మనోహరమైన వ్యక్తిత్వం గాళ్స్ లో స్ఫూర్తి నింపుతోంది. ఆల‌య సోషల్ మీడియాలో పోస్ట్ ల‌ను అభిమానులు ఎంత‌గానో ఇష్టపడతారు.

స్టార్ కిడ్ అవ్వ‌డం వ‌ల్ల ప్రయోజనాలు ఉన్నాయి. దుష్ప‌రిణామాలు ఉన్నాయ‌ని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. సాధారణంగా సెట్లో మర్యాదగా ఉండే చోట అవ‌కాశం ఉంటుంది నాకు.మేమంతా ఒక‌చోట‌ కూర్చుంటాము. ఇత‌రులు నాతో చాట్ చేస్తారు. వారు నా రీల్‌ని చూస్తారు. వారు నాకు మంచి ప్రోత్సాహం ఇస్తారు. కానీ ఎవ‌రూ నాకు సినిమా ఇవ్వరు.. అని ఆల‌య అంది. అలయ ఎఫ్ తదుపరి శ్రీ చిత్రంలో కనిపిస్తుంది. ఇందులో రాజ్‌కుమార్ రావు క‌థానాయ‌కుడు. తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు.