Begin typing your search above and press return to search.

చూసి చూడ‌కుండా రివ్యూలిచ్చే వాళ్ల‌ని ఏమ‌నాలి!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈసినిమా వైఫ‌ల్యం పై ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. 'కెరీర్ లో జ‌యాప‌జ‌యాలు స‌హ‌జం.

By:  Tupaki Desk   |   1 May 2024 3:30 PM GMT
చూసి చూడ‌కుండా రివ్యూలిచ్చే వాళ్ల‌ని ఏమ‌నాలి!
X

అలయ ఎఫ్ బాలీవుడ్ లోకి సైలెంట్ గా దూసుకొచ్చిన అందగత్తె. అంతకుమించి నటవారసురాలిగా సుపరిచితం. ప్రముఖ సీనియర్ కథానాయిక పూజా భేడీకి అలయ కుమార్తె. అమ్మ‌డు న‌టే కాదు. మంచి స్క్రీన్ ప్లే రైట‌ర్ కూడా. న‌టిగా మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి ముందే రైట‌ర్ గా ప‌నిచేసింది. అటుపై ఐదేళ్ల గ్యాప్ అనంత‌రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'జ‌వానీ జానేమేన్'..'ప్రెడీ'.. 'ఆల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మెహ‌బ‌త్'..'యూ ట‌ర్న్' లాంటి చిత్రాల్లో న‌టించింది.

ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ తో క‌లిసి 'బ‌డేమ‌యాన్ చోటే మియాన్' లో కూడా న‌టించింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ని సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈసినిమా వైఫ‌ల్యం పై ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. 'కెరీర్ లో జ‌యాప‌జ‌యాలు స‌హ‌జం. అవి ఎంత మాత్రం నాపై ప్ర‌భావం చూపించ‌వు. ప్రేక్ష‌కులు మెచ్చేలా న‌డుచుకుంటూ వెళ్ల‌డ‌మే నా ప‌ని. సినిమా ఫ‌లితం గురించి ఎందుకు ప‌ట్టించుకోనంటే? ఆ చిత్రం నుంచి అప్ప‌టికే చాలా విష‌యాలు నేర్చుకుని ఉంటాను.

అంటే ఆ సినిమా నుంచి పూర్తిగా పాజిటివ్ అంశాలే తీసుకుంటాను. సినిమాకి సంబంధించిన అస‌లైన రివ్యూ కేవ‌లం ప్రేక్ష‌కుల నుంచే వ‌స్తుంది. సినిమా చూసి చూడ‌కుండా అభిప్రాయం చెప్పేస్తుంటారు. అలాంటి వారి గురించి ఏం మాట్లాడ‌గ‌లం . నా పాత్ర‌లో గొప్ప‌గా న‌టించాన‌ని కొంద‌రు అంటే? చెత్త‌గా న‌టించాన‌ని మ‌రికొంత మంది అంటారు. అందులో నేనే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాల‌ని ఒక్కోసారి నాకే సందేహం వ‌స్తుంది.

అంద‌ర్నీ మెప్పించ‌డం అంటే ఎవ‌రికీ సాధ్యం కాదు. ఒప్పుకున్న ప్ర‌తి పాత్ర‌పై మ‌న‌సు పెట్టి ప‌ని చేయ‌డ‌మే నా ప‌ని. అంత‌కు మించి ఓ న‌టిగా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేను' అని అంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా బ‌యోపిక్ లో న‌టిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. అమ్మ‌డి కెరీర్ లో ఇదే తొలి బ‌యోపిక్ కూడా. దీంతో సినిమా ఆశ‌లు భారీగానే పెట్టుకుంది. ఈనెల 10న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.