అలప్పుజ జింఖానా మరో ప్రేమలు అవుతుందా?
మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటి ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమవుతుందని, దానికి తోడు సినిమాలో నస్లెన్ మంచి పెర్ఫార్మెన్స్ ను కనబరిచాడని అంటున్నారు.
By: Tupaki Desk | 11 April 2025 11:24 PM ISTమలయాళ మూవీ ప్రేమలు ఫేమ్ నస్లెన్ గఫూర్ ప్రధాన పాత్రలో ఖలీద్ రెహమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ సినిమా అలప్పుజ జింఖానా. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అలప్పుజ జింఖానా సినిమా చూసిన చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాను రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటి ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమవుతుందని, దానికి తోడు సినిమాలో నస్లెన్ మంచి పెర్ఫార్మెన్స్ ను కనబరిచాడని అంటున్నారు. ఏప్రిల్ 10వ తేదీన మలయాళం నుంచి అలప్పుజ జింఖానా తో పాటూ బాసిల్ జోసెఫ్ నటించిన మరణ మాస్, మమ్ముట్టి హీరోగా నటించిన బజూక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ మూడు సినిమాల్లో అలప్పుజ జింఖానా విన్నర్ గా నిలిచింది. ఆడియన్స్ నుంచి మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకెళ్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అన్నింటికంటే సర్‌ప్రైజింగ్ విషయమేంటంటే ఏప్రిల్ 10వ తేదీనే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సన్నీడియోల్ జాత్, సిద్దు జొన్నలగడ్డ జాక్ కూడా రిలీజ్ అయ్యాయి.
ఇన్ని సినిమాలు రిలీజైనప్పటికీ అలప్పుజ జింఖానా బాక్సాఫీస్ వద్ద మంచి స్క్రీన్ కౌంట్ తో హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలప్పుజ జింఖానా రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశముంది. చూస్తుంటే ప్రేమలు తర్వాత నస్లెన్ నటించిన అలప్పుజ జింఖానా రెండో రూ.100 కోట్ల గ్రాసర్ గా నిలిచేలా అనిపిస్తుంది. చూడాలి మరి.
