Begin typing your search above and press return to search.

అనన్యపాండే సిస్ట‌ర్ యూట్యూబ్ ఆదాయం షాకింగ్

ఇప్పుడు అత‌డి మాదిరిగానే యూట్యూబ్- డిజిట‌ల్ మాధ్య‌మాల్లో చురుగ్గా వీడియోలు పోస్ట్ చేస్తూ కోట్ల‌లో ఆర్జిస్తున్న ఒక జంటను మీకు ప‌రిచ‌యం చేయాలి.

By:  Tupaki Desk   |   9 May 2025 5:08 PM
అనన్యపాండే సిస్ట‌ర్ యూట్యూబ్ ఆదాయం షాకింగ్
X

యూట్యూబ్, డిజిట‌ల్ మాధ్య‌మాలు చాలామంది క్రియేట‌ర్ల‌కు భారీ ఆదాయ మార్గాలుగా మారాయి. సెల‌బ్రిటీలు కాలేని చాలామంది యూట్యూబ్ సెల‌బ్రిటీలు(ప్ర‌భావ‌శీలురు)గా ప్ర‌జ‌ల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ల‌క్ష‌ల్లో ప్యాకేజీ అందుకునే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ల‌ను మించి ఆదాయాన్ని ఆర్జిస్తూ కొంద‌రు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. నా అన్వేష‌ణ అన్వేష్ అయితే కోట్లలో రెవెన్యూ ఆర్జించి షాకిచ్చాడు.

ఇప్పుడు అత‌డి మాదిరిగానే యూట్యూబ్- డిజిట‌ల్ మాధ్య‌మాల్లో చురుగ్గా వీడియోలు పోస్ట్ చేస్తూ కోట్ల‌లో ఆర్జిస్తున్న ఒక జంటను మీకు ప‌రిచ‌యం చేయాలి. ఈ జోడీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టులు కాదు. కానీ సినీరంగంతో క‌నెక్ట్ అయి ఉన్నారు. లైగ‌ర్ బ్యూటీ అన‌న్యపాండే సోద‌రి అల‌న్నా పాండే ఆమె భ‌ర్త గురించిన వార్త ఇది. అల‌న్నా ఆమె భ‌ర్త ఐవ‌ర్ యూట్యూబ్ వీడియోల‌తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా అల‌న్నా బోల్డ్ పెర్ఫామెన్సెస్ కి విప‌రీత‌మైన గిరాకీ ఉంది. దీంతో త‌న‌కు సోష‌ల్ మీడియాల్లో అనూహ్య‌మైన ఫాలోయింగ్ పెరిగింది. భ‌ర్త‌తో క‌లిసి అల‌న్నా చేసిన వీడియోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతుండ‌డంతో ఆ మేర‌కు ఆదాయం కూడా ఊహించ‌నంత‌గా ఉంది. ఈ జంట మ‌రో ఐదేళ్ల‌లో లైఫ్ లో సెటిలైపోతున్నామ‌ని, అంత భారీ మొత్తాన్ని ఆర్జిస్తున్నామ‌ని చెబుతున్నారు.

తిన‌డానికి ఉండ‌టానికి ల‌గ్జ‌రీగా లైఫ్ ని గ‌డ‌ప‌డానికి అవ‌స‌ర‌మైనంత సంపాదిస్తున్నామ‌ని అల‌న్నా- ఐవ‌ర్ జంట చెబుతున్నారు. అంతేకాదు త‌మ సంపాద‌న గురించి చెప్ప‌కుండా ఈ జంట దాచేస్తున్నారు. అల‌న్నా భ‌ర్త‌ ఐవర్ త‌న సంపాద‌న గురించి ఒక హింట్ ఇచ్చాడు. అలాగే సంపాద‌న గురించి ఎవ‌రికీ చెప్ప‌కూడ‌ద‌ని కూడా సూచించాడు. త‌న తండ్రి, తాత నుంచి ఇది వార‌స‌త్వంగా వ‌చ్చింద‌ని తెలిపాడు. ఒక అంచ‌నా ప్ర‌కారం.. అల‌న్నా- ఐవ‌ర్ రెగ్యుల‌ర్ గా బోల్డ్ వీడియోల‌ను షేర్ చేస్తూ యువ‌త‌రంలో గొప్ప ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇది భారీగా ఆర్జించేందుకు స‌హ‌క‌రిస్తోంది.

అలాన్నా- ఐవోర్ విదేశాల‌లో నివ‌శించారు. రెండేళ్ల‌ క్రితం భారతదేశంలో వివాహం చేసుకున్నారు. ఈ జంట‌ వివాహానికి షారుఖ్ ఖాన్ సహా బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అలాన్నా - ఐవోర్ గత సంవత్సరం తమ మొదటి బిడ్డ కొడుకు రివర్‌ను స్వాగతించారు. ఈ జోడీ ప్రైమ్ వీడియో రియాలిటీ షో ది ట్రైబ్‌లో కూడా కలిసి కనిపించారు. అలాన్నా సోదరుడు అహాన్ పాండే, యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.