Begin typing your search above and press return to search.

ట్యాక్స్ చెల్లింపులో దిగ్గ‌జాల్నే త‌ల‌ద‌న్నిన హీరో!

ఖాన్ రేంజ్ హీరోల పారితోషికాల్ని ఆ ర‌కంగా అన్ని ర‌కాలుగా మ్యాచ్ చేయ‌గ‌ల్గుతున్నారు

By:  Tupaki Desk   |   1 Aug 2023 6:55 AM GMT
ట్యాక్స్ చెల్లింపులో దిగ్గ‌జాల్నే త‌ల‌ద‌న్నిన హీరో!
X

ఆదాయ‌న్ని బ‌ట్టి ట్యాక్స్ చెల్లింపు ఉంటుంది. అత్యంత సంప‌న్నులు అధిక శాతం ట్యాక్స్ పే దారులుగా ఉంటారు. ఇందులో ఎక్కువ‌గా బిజినెస్ మ్యాన్లు క‌నిపిస్తుంటారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ నాయ‌కులు.. సెల‌బ్రిటీలు..క్రీడాకారులు ఉంటారు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ అంద‌ర్నీ త‌ల‌ద‌న్నాడు. బిజినెస్ టైకూన్ల‌ను సైతం ప‌క్క‌కు నెట్టి అత్య‌ధిక ట్యాక్స్ పేయ‌ర్ గా నిలిచారు. దేశంలోనే అత్యధికంగా పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచారు.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ లెక్క‌ల ప్ర‌కారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.29.5 కోట్ల పన్నును చెల్లించారు. ఆర్దిక సంవ‌త్స‌రంలో 486 కోట్ల ఆదాయ‌న్ని చూపించారు. దీంతో అక్ష‌య్ ఆదాయం అంత ఉందా? అని అంతా షాక్ అవుతున్నారు. షారుక్ ఖాన్...స‌ల్మాన్ ఖాన్..హృతిక్ రోష‌న్...అమీర్ ఖాన్ రేంజ్ హీరో కాదు. వాళ్ల సినిమాలు సాధించిన‌న్ని వ‌సూళ్లు ఖిలాడీ సినిమాలు సాధించ‌వు. కానీ ఇదంతా ఎలా సాధ్య‌మైందంటారా?

బాలీవుడ్ లో బిజీ న‌టుల్లో అక్ష‌య్ కుమారు ఒక‌రు. ఏడాదికి ఒక సినిమా లెక్క‌లో ఆయ‌న సినిమాలు చేయ‌రు. ఏడాదిలో క‌నీసం నాలుగైదు సినిమాలైనా రిలీజ్ చేస్తుంటారు. దాదాపు మూడు ద‌శాబ్ధాలుగా ఆయ‌న జ‌ర్నీ అలాగే సాగుతుంది. ఆ ర‌కంగా బాలీవుడ్ బిజీ న‌టుల్లో ఒక‌రుగా నిలుస్తున్నారు. అలాగే మార్కెట్ లో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఖిలాడీకి మంచి పేరుంది. వాణిజ్య ప్ర‌క‌న‌టల ద్వారానే కోట్ల రూపాయాల ఆదాయం స‌మ‌కూరుతుంది. ఖాన్ రేంజ్ హీరోల పారితోషికాల్ని ఆ ర‌కంగా అన్ని ర‌కాలుగా మ్యాచ్ చేయ‌గ‌ల్గుతున్నారు.

సినిమాల‌తో పాటు వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ హౌస్.. స్పోర్ట్స్ టీమ్ ని సోంతంగా నిర్వహిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా అత్యధిక పన్ను చెల్లింపుదారుగా రూ.25.5 కోట్లతో అక్షయ్ కుమారే ముందున్నారు. మ‌రి వ్యాపార వేత్త‌లు ఎలా వెనుక బ‌డ్డారంటే? దానికో కార‌ణం ఉంది. ముఖేష్ అంబానీ..గౌత‌మ్ అంబానీ వంటి పారిశ్రామిక దిగ్గ‌జాల ఆస్తులు ఎక్కువగా కంపెనీల పేరిట ఉంటాయి. ఆదాయం కూడా కంపెనీ వాటాగా వెళ్తుంది.