Begin typing your search above and press return to search.

బ్యాక్ టు బ్యాక్ 16 ఫ్లాప్స్‌ పై హీరో రియాక్ట్‌

బాలీవుడ్‌ లో 2020 కి ముందు అక్షయ్‌ కుమార్ హవా కొనసాగింది. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తూ వచ్చాయి

By:  Tupaki Desk   |   27 March 2024 5:37 AM GMT
బ్యాక్ టు బ్యాక్ 16 ఫ్లాప్స్‌ పై హీరో రియాక్ట్‌
X

బాలీవుడ్‌ లో 2020 కి ముందు అక్షయ్‌ కుమార్ హవా కొనసాగింది. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తూ వచ్చాయి. ఆయన ఖాతాలో ఉన్నన్ని వంద కోట్ల సినిమాలు మరే హీరో ఖాతాలో లేవు అనడంలో సందేహం లేదు. అలాంటి అక్షయ్ కుమార్ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

2020 నుంచి అంటే కరోనా సమయం నుంచి అక్షయ్‌ కుమార్ నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సందడి చేయలేక పోతున్నాయి. హిందీ బాక్సాఫీస్ వర్గాల ప్రకారం ఇప్పటి వరకు అక్షయ్‌ బ్యాక్ టు బ్యాక్‌ ఏకంగా 16 ఫ్లాప్స్ ను చవి చూడటం జరిగింది.

వరుస ఫ్లాప్స్ ను చవి చూస్తున్నా కూడా అక్షయ్‌ కుమార్‌ స్పీడ్‌ తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన బడే మియా చోటే మియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైగర్‌ ష్రాఫ్‌ తో కలిసి అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో నటించాడు. తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.

బడే మియా చోటే మియా సినిమా ట్రైలర్ లాంచ్‌ కార్యక్రమంలో అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ తన వరుస 16 ఫ్లాప్స్ పై స్పందించాడు. వరుసగా తన సినిమాలు నిరాశ పరుచుతూ ఉన్నా కూడా నేను విభన్న జోనర్‌ లలో సినిమాలు చేయడం మానను అన్నాడు.

ట్రెండ్‌ కి తగ్గట్లుగా సినిమాలు చేయాలని నేను కోరుకుంటాను. అందులో భాగంగా కొన్ని ఫ్లాప్ అయినా కూడా నేను పట్టించుకోను అన్నట్లుగా అక్షయ్‌ కుమార్‌ చెప్పుకొచ్చాడు. ఈసారి బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్‌ కొడతాను అనే నమ్మకంతో అక్షయ్‌ కుమార్‌ కనిపిస్తున్నారు. వరుస ఫ్లాప్స్ కి అక్షయ్‌ బ్రేక్ వేసేనా చూడాలి.