Begin typing your search above and press return to search.

ఏడాదిలో అత్యధిక సినిమాలు… ఒక్క సక్సెస్ లేదు

బాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తుంది

By:  Tupaki Desk   |   31 Jan 2024 5:05 AM GMT
ఏడాదిలో అత్యధిక సినిమాలు… ఒక్క సక్సెస్ లేదు
X

బాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుత జెనరేషన్ లో ఏడాదికి 3 నుంచి 5 సినిమాల వరకు రిలీజ్ చేస్తోన్న హీరోగా అక్షయ్ కుమార్ ఉన్నాడు. అతని ఇమేజ్ ఖాన్ త్రయం కంటే ఎక్కువగా ఉంది.

యాక్షన్, ఎంటర్టైనర్, ఎమోషనల్, న్యూ జెనరేషన్ కంటెంట్, మైథాలజీ ఇలా ఏదైనా కూడా అక్షయ్ కుమార్ ఈజీగా ఎడాప్ట్ చేసుకొని నటిస్తాడు. మిగిలిన హీరోలు అందరూ పర్టిక్యులర్ గా ఒక జోనర్ కి పరిమితం అయిపోవడం వలన కథల ఎంపికలో వారికి ఛాలెంజ్ అవుతుంది. అయితే అక్షయ్ కుమార్ మాత్రం కథ నచ్చితే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లిపోతాడు. అలాగే తక్కువ సమయంలో పూర్తి చేసేస్తాడు.

2019లో కోవిడ్ కి ముందు అక్షయ్ కుమార్ ఏడాదిలో నాలుగు సినిమాలని ప్రేక్షకులకి అందించి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాల ద్వారా ఏకంగా 980 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నారు. కేసరి, హౌస్ ఫుల్ 4, మిషన్ మంగళ్, గుడ్ న్యూస్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇలా వరుస సక్సెస్ లతో అక్షయ్ కుమార్ రేంజ్ పెరిగిపోయింది.

ఆ తరువాత అక్షయ్ కుమార్ ని ఫ్లాప్ లు వెంటాడాయి. బెల్ బాటమ్ డిజాస్టర్ అయ్యింది. సూర్యవంశీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తరువాత బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సెల్ఫీ, OMG2, మిషన్ రాణిగంజ్ సినిమాలతో వచ్చాడు. వీటిలో ఒక్క OMG 2 మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. మిగిలినవన్నీ డిజాస్టర్ అయ్యాయి.

ఇలా ఒకే ఏడాదిలో 4 సూపర్ హిట్స్ నుంచి వరుసగా 10 డిజాస్టర్ ఇచ్చిన హీరోగా అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఏడాది బడే మియాన్ చోటే మియాన్, సింగం 3 సినిమాలు అక్షయ్ కుమార్ నుంచి రాబోతున్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుందనేది చూడాలి.