Begin typing your search above and press return to search.

హీరో విదేశీ పౌరసత్వంకు 14 సినిమాలు ఫ్లాప్‌ కారణం

ఏకంగా 14 సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో నేను మానసికంగా ఇబ్బందులకు గురి అయ్యాను. దాంతో కెనడాలో ఉండే నా స్నేహితుడు అక్కడకు రమ్మన్నాడు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 9:49 AM GMT
హీరో విదేశీ పౌరసత్వంకు 14 సినిమాలు ఫ్లాప్‌ కారణం
X

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌ కి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరసత్వంను ఇచ్చిన విషయం తెల్సిందే. చాలా సంవత్సరాలుగా కెనడా పౌరసత్వం తో ఇండియాలో ఉంటున్న అక్షయ్ కుమార్‌ ని చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. 9 ఏళ్ల పాటు కెనడా పౌరసత్వం తో కొనసాగిన అక్షయ్‌ కి ఇటీవల ఇండియన్ గా గుర్తింపు రావడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విదేశీ పౌరసత్వం గురించి ఆసక్తికర విషయాలను అక్షయ్‌ కుమార్ వెళ్లడించాడు. తాను బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో వరుసగా వచ్చిన ఫ్లాప్స్ నన్ను కుంగదీస్తాయి. ఏకంగా 14 సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో నేను మానసికంగా ఇబ్బందులకు గురి అయ్యాను. దాంతో కెనడాలో ఉండే నా స్నేహితుడు అక్కడకు రమ్మన్నాడు.

స్నేహితుడి పిలుపు మేరకు నేను కెనడా వెళ్లాను. కెనడా వెళ్లే సమయానికి నేను నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కెనడా వెళ్లిన తర్వాత ఆ రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అప్పటికే నాకు కెనెడా ప్రభుత్వం నుంచి పౌరసత్వం లభించింది. కెనడా వచ్చిన తర్వాత లభించిన సక్సెస్ లతో బాలీవుడ్‌ లో నేను బిజీ అయ్యాను.

బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల తొమ్మిది సంవత్సరాల పాటు కెనడా పౌరసత్వం తో ఇండియాలో ఉన్నాను. ఇప్పుడు నాకు ఇండియా పౌరసత్వం లభించడం చాలా సంతోషంగా ఉందని అక్షయ్ కుమార్‌ పేర్కొన్నాడు.

నేను నా పాస్ పోర్ట్‌ లో ఇండియన్ అని చూసుకోవడంను సంతోషిస్తాను.. విదేశాల్లో నా పాస్ పోర్ట్‌ ను చూపించిన సమయంలో అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు నేను తెలియకున్నా కూడా ఓహ్‌.. ఇండియన్‌.. బాలీవుడ్‌.. మోడీ అంటారు. ఇండియన్ పాస్ పోర్ట్‌ చూడగానే వారు మోడీ పేరును గుర్తు చేస్తారంటూ అక్షయ్ కుమార్‌ చెప్పుకొచ్చాడు.