Begin typing your search above and press return to search.

ఈ భారీతనం వెనక సీక్రెట్ అదేనా కన్నప్పా..?

ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప సినిమాలో భారీ తారాగణం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   22 April 2024 6:27 AM GMT
ఈ భారీతనం వెనక సీక్రెట్ అదేనా కన్నప్పా..?
X

మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు కెరీర్ లో చాలా వెనకపడ్డా తనదైన శైలిలో ప్రయత్నాలు మాత్రం చేస్తూనే వస్తున్నాడు. జిన్నా సినిమా తర్వాత సినిమాల పర్నగా రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన మంచు విష్ణు కన్నప్ప అంటూ ఒక భారీ సినిమాకే శ్రీకారం చుట్టాడు. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప సినిమాలో భారీ తారాగణం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

టాలీవుడ్ నుంచి మొదలు పెట్టి కోలీవుడ్, శాండల్ వుడ్, మల్లూవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో స్టార్స్ ని ఈ సినిమా కోసం దించుతున్నాడు మంచు విష్ణు. మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్, తెలుగు నుంచి మోహన్ బాబులతో పాటుగా రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా సినిమాలో భాగం చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని కూడా తీసుకొచ్చి సినిమా రేంజ్ మరింత పెంచాడు మంచు విష్ణు.

కన్నప్ప మీద మంచు విష్ణు పెడుతున్న ఎఫర్ట్స్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఇంతమందిని ఒకచోట చేర్చుతున్న మంచు హీరో కష్టానికి తగిన గుర్తింపు లభించేలా ఉంది. అయితే కన్నప్ప లో ఇంత భారీ క్యాస్టింగ్ కి మరో రీజన్ కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మంచు విష్ణు ఈ సినిమాను ముందు తన మార్కెట్ కు తగినట్టుగా లిమిటెడ్ బడ్జెట్ లో పూర్తి చేద్దామని అనుకున్నాడట. కానీ సినిమా బాగా వస్తుండటం వల్ల పాత్రలు వాటికి తగినట్టుగా పాత్రదారులను తీసుకోవడం మొదలు పెట్టాడు.

అలా ప్రభాస్ తో మొదలై అక్షయ్ కుమార్ ని కూడా తీసుకునేలా మూమెంట్ వచ్చింది. ఇదంతా కన్నప్పని రెండు భాగాలుగా చేసేందుకే అని అంటున్నారు. ఈమధ్య భారీ బడ్జెట్ తో వచ్చే సినిమా ఏదైనా రెండు భాగాలుగా చేయడం కామన్ అయ్యింది. ఆ దారిలోనే కన్నప్ప కూడా రెండు భాగాలుగా వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. అయితే ఇలా రెండు భాగాలుగా చేయాలి అంటే మాత్రం సినిమా అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించాల్సి ఉంటుంది. కన్నప్ప నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ మాత్రమే వదిలారు. టీజర్ రిలీజైతే కన్నప్ప రేంజ్ ఏంటన్నది తెలుస్తుంది.