Begin typing your search above and press return to search.

ర‌వీనా కూతురుతో అక్ష‌య్ కూతురి పోలిక‌?

తాజా వీడియోలో రవీనా కుమార్తె రాషా కంటే ముద్దుగా ఉందని నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్షయ్ కుమార్ కూతురు నితారా పెద్దగా, అందంగా తయారైందని పొగిడేస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:54 AM GMT
ర‌వీనా కూతురుతో అక్ష‌య్ కూతురి పోలిక‌?
X

అక్షయ్ కుమార్ కూతురు నితారాపై నెటిజ‌నుల వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. నితారా ఇప్పుడు బాగా ఎదిగేసింది.. రవీనా కూతురు రాషా కంటే ముద్దుగా ఉందని నెటిజ‌నులు ప్ర‌శంసిస్తున్నారు. తాజా వీడియో నుంచి ఫోటోలు వైరల్ అయ్యాక‌ అభిమానులు ట్వింకిల్ ఖన్నా కు డోపెల్‌గ్యాంగర్ అని కూడా పోల్చి చెప్పారు. తాజా వీడియోలో రవీనా కుమార్తె రాషా కంటే ముద్దుగా ఉందని నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్షయ్ కుమార్ కూతురు నితారా పెద్దగా, అందంగా తయారైందని పొగిడేస్తున్నారు. ముఖ్యంగా అక్ష‌య్ మాజీ ప్రేయసి ర‌వీనాటాండ‌న్ కుమార్తె రాషా తో నితారాను పోల్చ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. రాషా తొంద‌ర్లోనే క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుండ‌గా ఇప్పుడు ఖిలాడీ డాట‌ర్ గురించి చ‌ర్చ ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ట్వింకిల్ ఖన్నా 90వ దశకంలో అందం ప్ర‌తిభ‌తో మెప్పించిన‌ ప్రముఖ నటి. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా .. నటి డింపుల్ కపాడియాల కుమార్తె. తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి బాలీవుడ్ స్టార్ హీరో ఖిలాడీ కుమార్ (అక్షయ్ కుమార్‌)ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.. కుమారుడు ఆరవ్ కుమార్ .. కుమార్తె నితారా ఉన్నారు. అక్ష‌య్ పిల్లలు ఇప్పుడు పెద్దవారు అయిపోయారు. ఇటీవల ట్వింకిల్ ఖన్నా తన కుమార్తె నితారాతో కలిసి విమానాశ్రయంలో కనిపించింది. అక్షయ్ కుమార్ తరచుగా తన కుమార్తె నితారాను కెమెరాల‌కు దూరంగా ఉంచడం కనిపిస్తుంది. కానీ ఇటీవ‌ల‌ నితారా కెమెరామెన్ల‌ ముందుకు వచ్చినప్పుడు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా క‌నిపించింద‌ని పాపుల‌ర్ బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ త‌న సోష‌ల్ మీడియాలో ప్ర‌స్థావించారు.

నితారా వేగంగా ఎదిగేస్తోంది. ఇదే విష‌యాన్ని ఖిలాడీ అక్కీ ఇటీవ‌ల నితార బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌స్థావించారు కూడా. "కూతుళ్లు ఎందుకు అంత వేగంగా పెరుగుతారో నాకు అర్థం కాలేదు" అని అక్కీ అన్నారు. అత‌డు మాట్లాడుతూ-"అడుగులు వేయడానికి నా చేతిని పట్టుకునే నా చిన్న పాప త్వరలో ఒక యువతి అవుతుంది. ప్రపంచం మొత్తాన్ని జయిస్తుంది. నితారా సృజనాత్మక మనస్సు గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఇతర పిల్లలు డిస్నీల్యాండ్‌ని సందర్శించాలనుకుంటున్నారు. కానీ నువ్వు ఒక డిస్నీ ల్యాండ్ నే సృష్టించాలనుకుంటున్నావు. నీ రెక్కలను విప్పు. నేను మీ అమ్మ ఎల్లప్పుడూ వాటి క్రింద గాలిగా ఉండటానికి ప్రయత్నిస్తాము" అంటూ అక్కీ ఎమోష‌న‌ల్ అయ్యారు. దీనిని బ‌ట్టి అక్ష‌య్ కుమార్తె పెరిగి పెద్ద‌దైపోయింది. ఇక‌పై క్రియేటివ్ రంగంలో త‌న సృజ‌నాత్మ‌క‌త‌ను చూపించ‌నుంది.

ఇటీవ‌ల ట్వింకిల్ ఖన్నా తన కుమార్తె నితారాతో విమానాశ్రయంలో కనిపించిన వీడియో వైరల్ భయాని పేజీలో క‌నిపించింది. నితారా ముఖాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. వీడియోలో జుట్టును సరిచేసుకుంటూ నితారా చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ వీడియో బయటకు రావడంతో అభిమానులు దానిపై స్పందించారు. "నితారా చాలా పెరిగింది... రవీనా కూతురు కంటే ముద్దుగా ఉంది" అని రాశారు. ఇటీవల ట్వింకిల్ తన కొత్త పుస్తకం `వెల్‌కమ్ టు ప్యారడైజ్` వార్తల్లో నిలిచింది.