Begin typing your search above and press return to search.

యువ‌హీరో ప‌క్క చూపుల‌పై స్టార్ హీరో పంచ్

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ``టైగర్‌ని ఎప్పుడూ ఒకే దిశలో ఉండమని చెప్పాను. టైగ‌ర్ దయచేసి పక్కదారి పట్టకుండా ఒకే దిశలో ఉండండి!`` అని జోక్ చేసాడు.

By:  Tupaki Desk   |   27 March 2024 2:30 AM GMT
యువ‌హీరో ప‌క్క చూపుల‌పై స్టార్ హీరో పంచ్
X

క్రేజీ యువ‌హీరో ఇంత‌కుముందు అందాల భ‌రిణె లాంటి క‌థానాయిక‌ను ప్రేమించాడు. కానీ ఆ త‌ర్వాత ఏమైందో త‌న‌కు బ్రేక‌ప్ చెప్పేశాడు. ఆ త‌ర్వాత అత‌డు వేరొక భామ‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని ప్ర‌చారం కాగా, అందాల భామ కూడా కొత్త బోయ్ ఫ్రెండ్ తో షికార్ చేస్తూ క‌నిపించింది. ఏది ఏమైనా ఇప్పుడు స‌ద‌రు యువ‌హీరో నిర్వాకంపై పంచ్ వేసాడు స‌ద‌రు స్టార్ హీరో. వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఎపిసోడ్ లో హీరోలు టైగ‌ర్- అక్ష‌య్.

ఇంత‌కుముందు 'వార్' చిత్రంలో హృతిక్ రోష‌న్ తో క‌లిసి క‌నిపించిన టైగర్ ష్రాఫ్, ఇప్పుడు అక్ష‌య్ కుమార్ తో క‌లిసి భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టించాడు. 'బ‌డే మియాన్ చోటే మియాన్' అనేది టైటిల్. 10 ఏప్రిల్ 2024న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ లో చిత్ర‌బృందం బిజీబిజీగా గడిపేస్తోంది.

ఇప్పుడు హోలీ సంద‌ర్భంగా టైగ‌ర్, అక్ష‌య్‌ల‌తో దిశా ప‌టానీ కూడా క‌లిసింది. దిశా పటానీ తన మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి హోలీని జరుపుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. హోలీలో ఆ ముగ్గురూ క‌లిసి ర‌చ్చ ర‌చ్చ చేసారు. ఒక‌రిపై ఒక‌రు రంగులు జ‌ల్లుకుంటూ బోలెడంత సంద‌డి చేసారు. చాలా కాలం తర్వాత 'బాఘీ 2' జంట టైగ‌ర్- దిశా కలిసి ఒకేచోట క‌నిపించ‌డం క‌న్నుల పండుగ‌గా మారింది. దిశా- టైగర్ జతకట్టడంపై కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

కొద్దిసేప‌టి క్రితం 'బడే మియాన్ చోటే మియాన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అక్షయ్ కుమార్ దిశా పటానీ పేరుతో టైగ‌ర్ ని ఆట‌ప‌ట్టించాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ''టైగర్‌ని ఎప్పుడూ ఒకే దిశలో ఉండమని చెప్పాను. టైగ‌ర్ దయచేసి పక్కదారి పట్టకుండా ఒకే దిశలో ఉండండి!'' అని జోక్ చేసాడు. దానికి అహూతులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. టైగర్ ష్రాఫ్‌కి అక్షయ్ కుమార్ ఇచ్చిన ఈ సలహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ న‌వ్వించింది. బడే మియాన్ చోటే మియాన్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ మరియు సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం బహుళ భాషల్లో 10 ఏప్రిల్ 2024న విడుదల కానుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వ‌హించారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.