అక్షయ్ ఖన్నాతో ప్రశాంత్ వర్మ.. అసలు ప్లాన్ ఏంటి?
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షయ్ ఖన్నా సడెన్ గా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారారు.
By: Tupaki Desk | 4 May 2026 10:21 AM ISTబాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షయ్ ఖన్నా సడెన్ గా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారారు. ధురంధర్ తర్వాత ఆయనకు సౌత్ లో అవకాశాలు వరుసగా వస్తుండగా, ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఆయన కాంబో ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే మహాకాళి సినిమాలో అసుర గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటిస్తున్న విషయం అధికారికంగా బయటకు వచ్చింది. ఇది ఆయనకు తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం. ఆ పాత్ర కథలో కీలక మలుపుగా ఉండబోతుందని తెలుస్తోంది. షూటింగ్ పార్ట్ కూడా పూర్తయి, అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని సమాచారం. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తో ఆ సినిమా రూపొందుతుండగా, PVCUలో ఇది ఫీమేల్ సూపర్ హీరో కథగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోనుంది.
ఇక్కడితో ఆగకుండా, ప్రశాంత్ వర్మ మరో పెద్ద ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. జై హనుమాన్ సినిమాలో కూడా అక్షయ్ ఖన్నాకు ఓ స్పెషల్ రోల్ ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తుండగా, అక్షయ్ ఖన్నా ఎంట్రీ ఆ ప్రాజెక్ట్ కు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తోంది. అయితే ఆయన పాత్ర ఏమిటి? విలన్ గా కనిపిస్తారా? లేక పవర్ ఫుల్ గెస్ట్ రోల్‌లో మెరవబోతున్నారా? అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇక మరో సూపర్ హీరో ప్రాజెక్ట్ అధీరలో కూడా అక్షయ్ ఖన్నా భాగమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే ఒకేసారి మూడు కీలక సినిమాల్లో ఆయనను తీసుకుని ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ ను స్ట్రాంగ్ గా మార్చాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మార్వెల్ తరహా స్ట్రాటజీగా భావిస్తున్నారు సినీ ప్రియులు. ప్రతి సినిమాలో ఒకే నటుడిని వేర్వేరు యాంగిల్స్ లో చూపిస్తూ, కథలను ఇంటర్ లింక్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాలనే ప్రయత్నమని చెప్పాలి.
అదే సమయంలో రీసెంట్ గా అక్షయ్ ఖన్నా యాక్టింగ్ గురించి ప్రశాంత్ వర్మ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం కూడా ఆ కాంబినేషన్ పై అంచనాలను పెంచుతోంది. "నిజమైన టాలెంట్ కు సౌండ్ అవసరం లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడూ క్లాస్ గా ఉంటుంది" అంటూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. కేవలం బర్త్ డే విషెస్ తో ఆగకుండా, ఫ్యూచర్ లో కలిసి రాబోయే కంటెంట్ పై హింట్ ఇవ్వడం మరింత ఆసక్తి పెంచింది.
మొత్తానికి చూస్తే.. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ను విస్తరించేందుకు అక్షయ్ ఖన్నాను కీలక ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. విభిన్నమైన పాత్రలు, మైథాలజీ ఎలిమెంట్స్, సూపర్ హీరో కాన్సెప్ట్స్ అన్నీ కలిపి PVCUని ఓ రేంజ్ లో తీసుకెళ్లాలనే ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా ఇప్పుడు అక్షయ్ ఖన్నా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
