Begin typing your search above and press return to search.

తెలుగు సినిమాలో ఛావా విలన్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 April 2025 1:45 PM IST
Akshaye Khanna Joins Prasanth Varma’s Mahakali
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హనుమాన్ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఆయన.. నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఆ తర్వాత తన యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరోస్ మూవీలను తీస్తానని కూడా అనౌన్స్ చేశారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం మూడో ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. మహాకాళి పేరుతో మూవీని తీస్తున్నట్లు తెలిపారు ప్రశాంత్ వర్మ. మిగతా విషయాలను కూడా ఆయన ప్రకటించారు.

ఇప్పుడు మహాకాళి మూవీ నుంచి క్రేజ్ అప్డేట్ వచ్చింది. సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీలో ఆయన రోల్ కు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ను రీసెంట్ గా ప్రశాంత్ వర్మ రీపోస్ట్ చేశారు.

దీంతో మహాకాళిలో అక్షయ్ ఖన్నా నటిస్తుండడం కన్ఫర్మ్ అనే చెప్పాలి. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఛావా మూవీలో అక్షయ్ ఖన్నా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఔరంగజేబు రోల్ లో కనిపించిన ఆయన అదరగొట్టేశారు. ఇప్పుడు PVCUలో భాగమైన మహాకాళి మూవీలో కీలక పాత్రలో సందడి చేయనున్నారు.

ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన.. ఇప్పుడు వివిధ చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కనిపించి అలరిస్తున్నారు. మరి మహాకాళి మూవీలో ఎలాంటి రోల్ లో కనిపిస్తారనేది ఆసక్తికరం. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కబోతున్న లేడీ సూపర్ హీరో మూవీ మహాకాళి అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇక మూవీ విషయానికొస్తే.. మహాకాళి సినిమాను ఆర్‌ కేడీ స్టూడియోస్‌ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ఆర్‌ కె దుగ్గల్ మూవీని సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల అధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్.. ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి రేపిందనే చెప్పాలి.