Begin typing your search above and press return to search.

14 ఏళ్ల త‌ర్వాత క్రేజీ కాంబినేష‌న్!

తాజాగా అక్ష‌య్ కుమార్ మ‌రోసారి స్టార్ మేక‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌రు. దీంతో ఈ జోడీ 14 ఏళ్ల త‌ర్వాత క‌లిసి చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 1:30 AM GMT
14 ఏళ్ల త‌ర్వాత క్రేజీ కాంబినేష‌న్!
X

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసు కుంటూ వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలి పెట్డం లేదు. ఈ మ‌ధ్య కాలంలో సౌత్ సినిమా ల‌కు సైన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో నాగార్జున కొత్త సినిమాలో అక్ష‌య్ న‌టిస్తు న్న‌ట్లు వినిపిస్తుంది. అందులో ఖిలాడీది నెగిటివ్ రోలా? పాజిటివ్ రోలా? అన్న‌ది తెలియ‌దు గానీ..నాగ్ స‌హా ద‌ర్శ‌కుడు అక్ష‌య్ ఆ పాత్ర‌కు న్యాయం చేస్తాడ‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్ కోలీవుడ్ లో '2.0' తో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. అందులో ప‌క్షిరాజు గా న‌టించి ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు. సౌత్ లో అక్ష‌య్ కి ఆ సినిమా గ్రాండ్ ఎంట్రీ గా నిలిచిన చిత్రాంలా నిలిచింది. తాజాగా అక్ష‌య్ కుమార్ మ‌రోసారి స్టార్ మేక‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌రు. దీంతో ఈ జోడీ 14 ఏళ్ల త‌ర్వాత క‌లిసి చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది.

అక్ష‌య్ హీరో కెరీర్ ఊపందుకోవ‌డంలో 'హేరాఫేరి' చిత్రం కూడా ఒక‌టి గా నిలిచింది. దీన్ని ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో అంత గొప్ప చిత్రం తెర‌కెక్కిన త‌ర్వాత మ‌ళ్లీ 2010 లో 'క‌ట్టా మిట్టా'తో క‌లిసి ప‌నిచేసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాళ్లిద్ద‌రు క‌లిసి ప‌నిచేసింది లేదు. బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్...సౌత్ లో ప్రియ‌ద‌ర్శ‌న్ ఎన్నో సినిమాలు చేసారు గానీ...స‌క్సెస్ కాంబినేష‌న్ మాత్రం ఆ ఛాన్స్ ఇంత కాలం తీసుకోలేదు.

ఈ నేప‌థ్యంలో ద‌శాబ్ధం త‌ర్వాత మ‌ళ్లీ చేతులు క‌లుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇది కామిక్ ఫాంట‌సీ చిత్రంగా తెర‌కెక్కుతుంది. వినోదం ప్ర‌ధానంగా హైలైట్ కానుంది. అక్ష‌య్ లో కామెడీ టైమింగ్ ని బేస్ ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారుట‌. ఇప్ప‌టికే స్టోరీ కూడా సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి రెగ్య‌ల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏక్తాక‌పూర్ నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం.