Begin typing your search above and press return to search.

భక్త కన్నప్ప.. ఆ బాలీవుడ్ స్టార్ కూడా సెట్టయ్యాడు!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   8 April 2024 6:34 AM GMT
భక్త కన్నప్ప.. ఆ బాలీవుడ్ స్టార్ కూడా సెట్టయ్యాడు!
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తుండడంతో మిగతా భాషల్లో కూడా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది అనే విషయం కన్నా కూడా ముఖ్యంగా స్టార్ క్యాస్ట్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక సినిమా కోసం ప్రముఖ నటీనటులు కూడా అడిగిన వెంటనే నటించాలని ఆసక్తి చూపిస్తూ ఉండడంతో ప్రాజెక్ట్ రేంజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.


ఇక భక్త కన్నప్పగా నటిస్తున్న మంచు విష్ణు నిర్మాతగా కూడా బడ్జెట్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మహాభారతం ఫేమ్ ముకేశ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భక్త కన్నప్ప సినిమాలో ఇప్పటికే ప్రభాస్ ద్వారా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అతను మహా శివుడిగా కనిపించబోతున్నాడు.

దీంతో పాన్ ఇండియా మార్కెట్ లో ఈ పాయింట్ తోనే కావాల్సినంత క్రేజ్ వచ్చింది. సౌత్ నుంచి మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, తమిళ్ నుంచి శరత్ కుమార్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, మోహన్ బాబు లాంటి వాళ్ళు సినిమాలో చాలా కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. తమిళ్ మలయాళం కన్నడ అంటూ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా మేకర్స్ స్టార్స్ ను సెలెక్ట్ చేసుకోవడం విశేషం.

ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా భక్త కన్నప్ప సినిమాలో భాగం కాబోతున్నట్లు కదలిస్తోంది. అతను కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడట. దీంతో ఈ సినిమాకు బాలీవుడ్ సైడ్ కూడా మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రోజురోజుకు భక్త కన్నప్ప రేంజ్ మరింత పెరిగిపోతూ ఉండడంతో సినిమాకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. మంచు విష్ణు క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. దాదాపు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇక మిగిలిన వర్క్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి విడుదల డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.