భిన్న ధృవాలే కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు, ఖిలాడీ అక్షయ్ కుమార్ ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కూడా పెద్ద హీరోయిన్. అంతేకాదు.. దబాయించే మనస్తత్వం ఉన్న పవర్ ఫుల్ విమెన్ కూడా.
By: Tupaki Desk | 30 Jun 2025 8:45 AM ISTబాలీవుడ్ అగ్ర కథానాయకుడు, ఖిలాడీ అక్షయ్ కుమార్ ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కూడా పెద్ద హీరోయిన్. అంతేకాదు.. దబాయించే మనస్తత్వం ఉన్న పవర్ ఫుల్ విమెన్ కూడా. కానీ అతడు ఆమెతో చాలా తెలివిగా సంసారాన్ని ముందుకు నడిపాడు. ఈ విషయాల్ని ఛూఛాయగా అతడు ఒప్పుకున్నాడు.
నేను సామాన్య యువకుడిని. ఒక చిన్న టౌన్ నుంచి సాధారణ నేపథ్యం నుంచి వచ్చాను. కానీ నా భార్య ట్వింకిల్ దక్షిణ ముంబైలోని ఒక మెరుగైన వాతావరణంలో పెరిగింది. సినీ దిగ్గజాలు రాజేష్ ఖన్నా -డింపుల్ కపాడియా కుమార్తె. మేమిద్దరం చాలా భిన్నమైన మార్గాల్లో ఆలోచిస్తాం. భిన్నమైన పనులు చేస్తాం. ఈ తేడాల కారణంగానే మా బంధం మరింతగా కలిసిందని అక్షయ్ చెప్పాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ట్వింకిల్ ఖన్నా, నేను ఒకరికొకరు స్పష్టమైన సరిహద్దులను పాటిస్తామని ఖిలాడి స్టార్ అక్షయ్ అన్నాడు. ఎవరైనా అడిగే వరకూ ఒకరి వృత్తిపరమైన జీవితాల్లో ఒకరు జోక్యం చేసుకోరు. ట్వింకిల్ స్వతహాగా పుస్తక రచయిత. నటిగాను రాణించినా సినిమాలకు దూరమైంది. రచయితగా ఇప్పుడు బిజీ బిజీ. తను ఒక కాలమ్‌పై తన అభిప్రాయాన్ని కోరితే, అతడు దానిని చదువుతాడు. నిజాయితీగా అభిప్రాయాన్ని అందిస్తాడు. కోరితే మాత్రమే చేస్తాడు. అతడు తనకు స్పేస్ ఇస్తాడు. తనను గౌరవిస్తాడు.. ప్రతిఫలంగా తన నుంచి అదే ఆశిస్తాడు.. ఒకరికొకరు వ్యక్తిగతంగా ఎదగడానికి స్వేచ్ఛను కల్పిస్తాడు..అక్షయ్ పాత ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని మాట్లాడాడు.
ఆరోగ్యకరమైన పని లైఫ్ బ్యాలెన్స్ ను కాపాడుకోవడం ప్రాముఖ్యతను కూడా అతడు నొక్కి చెప్పాడు. ఇటీవల షూటింగ్ సమయంలో ఒక గ్రామానికి వెళ్ళిన అతడు ఒక రైతు ఇంట్లో టీ తాగాడు. వారి జీవనశైలి సింపుల్ గా ఉన్నా వారంతా ఆనందంగా ఉన్నారు. నగర జీవితంలో కాలుష్యం ఒత్తిళ్లు తనకు గుర్తుకొచ్చాయని తెలిపాడు. సింప్లిసిటీ, సమతుల్యతతోనే ఆనందం దక్కుతుందని అక్షయ్ అన్నాడు.
