మరో రీమేక్ కు రెడీ అయిన బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ తో హిట్ అందుకోవాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాడు.
By: Tupaki Desk | 5 May 2025 4:30 PMబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ తో హిట్ అందుకోవాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాడు. రీమేక్స్ తో వరుస ఫ్లాపులు అందుకున్నప్పటికీ, అక్షయ్ ఇప్పుడు మరో రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్ మలయాళ సినిమా ఒప్పంకు సైన్ చేశాడని అంటున్నారు.
కరోనా తర్వాత అక్షయ్ కుమార్ ఇప్పటికే పలు రీమేక్స్ చేశాడు. కానీ వాటిలో ఏవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అక్షయ్ కుమార్ కాంచన రీమేక్ గా లక్ష్మీ సినిమాను, తమిళ మూవీ రాట్ససన్ ను కట్‌పుట్లీని రీమేక్ చేశాడు. ఈ రెండు సినిమాలూ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజయ్యాయి కానీ ఆడియన్స్ నుంచి మాత్రం ఆ రెండు సినిమాలకూ సరైన రెస్పాన్స్ రాలేదు.
తమిళ సినిమా జిగర్తాండను బచ్చన్ పాండేగా రీమేక్ చేశాడు. ఆ తర్వాత మలయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్‌ను సెల్ఫీ పేరుతో రీమేక్ చేశాడు. ఆఖరిగా సూర్య నటించిన సురారై పొట్రు సినిమాను సర్ఫిరా పేరుతో రీమేక్ చేశాడు. తమిళ, మలయాళ సినిమాలను అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తూ వాటితో హిట్లు అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.
ఇప్పుడు అక్షయ్ కుమార్ మరో మలయాళ సినిమా ఒప్పం ను రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళంలో హిట్ గా నిలిచినా బాలీవుడ్ లో హిట్ అవుతుందని నమ్మకం లేదు. గతంలో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాను రీమేక్ చేస్తాడని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ఆ సినిమాను అక్షయ్ కుమార్ చేస్తున్నట్టు తెలుస్తోంది.