కొరియన్ నిర్మాతతో స్టార్ హీరో సినిమా!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 15 Nov 2025 11:56 AM ISTబాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు..మూడు సినిమాలు సెట్స్లో ఉండగానే కొత్త ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతుంటారు. ప్రస్తుతం అక్షయ్ కమార్ నటిస్తోన్న మూడు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ మూడు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. వాటి రిలీజ్ కు ముందే కొత్త ప్రాజెక్ట్ లు మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొరియన్ నిర్మాతతో కూడా ఓ ప్రాజెక్ట్ ఒప్పందం చేసుకున్నారు. `టెన్-3`, `జానే జాన్` లాంటి హిందీ చిత్రాలను నిర్మించిన కొరియన్ నిర్మాత హ్యూన్ వూ థామస్ కిమ్ అక్షయ్ తో సినిమా నిర్మించడానికి కదులుతున్నారు.
లండన్ లో హీరోతో చర్చలు:
ఇటీవలే లండన్ లో ఉన్న అక్షయ్ కు ఈ విషయం చెప్పగానే ఎంతో సంతోషించినట్లు తెలిపారు. లైన్ నచ్చడంతో అక్షయ్ కుమార్ మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పినట్లు తెలిపారు. అయితే ఇది ఓ కొరియన్ సినిమాకు రీమేక్ రూపం. ఆ సినిమా స్టోరీ లైన్ నచ్చడంతో హిందీకు తగ్గట్టు మౌల్డ్ చేస్తున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? అంటే సుజోయ్ ఘోష్ ని తెరపైకి తెస్తున్నారు. ఆయనతో కూడా కిమ్ సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే కొరియాలో సరైన రచయితలు లేరని కిమ్ అభిప్రాయ పడ్డారు.
భారత్ లో గొప్ప రచయితలు:
భారత్ తో పోలిక చేస్తే తమ ప్రతిభ చాలా చిన్నదని..ఈ మధ్య కాలంలో భారత్ నుంచి రిలీజ్ అవుతున్న కొన్ని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంటున్నాయన్నారు. భవిష్యల్ తో భారత్ నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇండియాకు భారీ మార్కెట్ ఉందని, గొప్ప దర్శక, రచయతలు, నటుల వల్ల మాత్రమే ఇది సాధ్యమైందన్నారు. మొత్తానికి కొరియన్స్ కూడా భారత్ ప్రతిభను ప్రశంసించడం గొప్ప విషయం. ఇంతటి ఖ్యాతి తెలుగు సినిమాల వల్ల వచ్చిందన్నది కాదనలేని నిజం. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` , `పుష్ప` లాంటి సినిమాలకు అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.
ఆ రెండు సినిమాలతో నెక్స్ట్ లెవల్:
`ఆర్ ఆర్ ఆర్` కు గ్లోబల్ స్థాయిలో రీచ్ అవ్వడం..`పుష్ప` సినిమాలో పాటలకు విదేశీయులు, క్రికెటర్స్ రీల్స్ చేయడంతో ? భారత్ సినిమాలకు ఎనలేని గుర్తింపు దక్కింది. అంతకు ముందు `బాహుబలి` సినిమాకు పలు దేశాల నుంచి అంతర్జాతీయ అవార్డులు అందుకోవడంతోనూ ఆ రేంజ్ సాధ్యమైంది. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాత ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిలో సరికొత్త రికార్డలు సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. అలాగే బన్నీ- అట్లీ ప్రాజెక్ట్ కూడా ఆ రేంజ్ లోనే సన్నధం అవుతోన్న సంగతి తెలిసిందే.
