F*** U వేదికపై గుర్తు చేసిన స్టార్ హీరో!
తాజాగా పహల్గామ్ తీవ్రవాద ఘాతుకాన్ని ఓ ప్రమోషన్ ఈవెంట్లో ప్రస్థావిస్తూ.. అతడు సినిమాలో ఉపయోగించిన F*** యు అనే నాలుగు అక్షరాల పదాన్ని గుర్తు చేసారు.
By: Tupaki Desk | 27 April 2025 4:40 PMబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎట్టకేలకు ఒక మంచి పాజిటివ్ నోట్ తో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో నిరాశలో కూరుకుపోయిన ఆయన తన తాజా రిలీజ్ `కేసరి 2` పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఉత్సాహం అతడిలో కనిపిస్తోంది. తాజాగా పహల్గామ్ తీవ్రవాద ఘాతుకాన్ని ఓ ప్రమోషన్ ఈవెంట్లో ప్రస్థావిస్తూ.. అతడు సినిమాలో ఉపయోగించిన F*** యు అనే నాలుగు అక్షరాల పదాన్ని గుర్తు చేసారు.
నేను తీవ్రవాదులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది నేను ఈ సినిమాలో ఉపయోగించిన ఒక పదం.. అదేమిటో చెబుతారా? అంటూ ఆడియెన్ కి అక్షయ్ ఫజిల్ వేసారు. దానికి స్పందిస్తూ `F*** యు` అంటూ ప్రజలు స్పందించారు. దీనిని బట్టి కోర్ట్ రూమ్ డ్రామా `కేసరి చాప్టర్ 2`లో కొన్ని డైలాగులు ప్రేక్షకుల్ని వెంటాడాయని అర్థం చేసుకోవాలి.
సినిమాలో సి.శంకరన్ నాయర్ పాత్రధారి ఈ అభ్యంతరకర పదాన్ని కోర్ట్ రూమ్ డ్రామాలో ఉపయోగించారు. కానీ అది ఆ సందర్భానికి సమయోచితమైనది. కొంత కల్పితమైనది. బానిసలు అంటూ బ్రిటీషర్లు భారతీయులను కించపరిచే సన్నివేశంలో అడ్వొకేట్ సి.శంకరన్ నాయర్ ఫక్ యు అని ఎదురు తిరుగుతారు. దీనిని టీజర్ ట్రైలర్ లోను కేసరి 2 మేకర్స్ ఆవిష్కరించారు.
అయితే ఇలాంటి నాలుగు అక్షరాల పదాన్ని శంకర్ నాయర్ ఎప్పటికీ ఉపయోగించరని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ తన సమీక్షలో పేర్కొన్నారు. కానీ అక్షయ్ బృందం చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. సినిమా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని, జలియన్ వాలాభాగ్ దురంతం అనంతరం జరిగిన కథను తెరపైకి అందంగా తెచ్చారని అన్నారు. కోర్ట్ రూమ్ డ్రామాను చూసేందుకు బోరింగ్ గా ఉంటుందని భయపడ్డానని, కానీ ఎక్కడా నీరసం తెప్పించలేదని థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెరపై ఈ కథను విప్పిన విధానం, దర్శకత్వం సహా ప్రతిదీ సాంకేతికంగా అద్భుతంగా ఉన్నాయని పొగిడారు. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చూడాలని ఆయన విజ్ఞప్తి చేసారు. రఘు పలాట్ , పుష్ప పలాట్ రాసిన `ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్` పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత జరిగిన సంఘటనలపై రాసిన పుస్తకమిది.