బౌన్య్ బ్యాక్ అయ్యాడనే లోపే వెంటనే పంచ్!
కిలాడీ అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2' తో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ వరుస ప్లాప్ లతో ఉన్న అక్షయ్ కు 'కేసరి చాప్టర్ 2' ఊపిరి పోసింది.
By: Tupaki Desk | 9 Jun 2025 7:12 AMకిలాడీ అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2' తో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ వరుస ప్లాప్ లతో ఉన్న అక్షయ్ కు 'కేసరి చాప్టర్ 2' ఊపిరి పోసింది. వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎన్నో ఎదుర్కున్నాడు. ఎన్నో అవమానాలకు గురయ్యాడు. ఈ క్రమంలో ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కు న్నాడు. అయినా ఏ రోజు నమ్మకాన్ని కోల్పోలేదు. విమర్శించిన నోళ్లే మళ్లీ ప్రశంసిస్తాయని ఎదురు చూసాడు. ఆ ఎదురు చూపులకు ఫలితమే కేసరి చాప్టర్2.
కిలాడీ నమ్మకాన్ని ఆ సినిమా నిలబెట్టింది. దీంతో తిరుగులేదనుకున్నారంతా. కానీ ఆ సంతోషం రెండు నెలలు కూడా గడవక ముందే హౌస్ ఫుల్ 5తో మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లే కనిపిస్తుంది. జూన్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కామెడీ థ్రిల్లర్ ప్రాంచైజీ హౌస్ పుల్ అంటే బాలీవు డ్ లో ఓ బ్రాండ్. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అన్ని సినిమాలు మంచి ఫలితాన్ని సాధించాయి.
దీంతో ఐదవ భాగం భారీ అంచనా ల మధ్య రిలీజ్ అయింది. భారీ తారగణంతో తరుణ్ మనుసుఖానీ తెరకెక్కించిన చిత్రమిది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఇప్పుడా బడ్జెట్ కూడా రావడం కష్టం. భారీ తారగణంతో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ లాంగ్ రన్ లో సినిమా నిలవడం కష్టమని తేలిపోయింది. వసూళ్ల పరంగా ఇప్పటికే 100 కోట్లపైనే రాబట్టింది. 130 కోట్ల వరకూ అంచనా వసూళ్లు. కానీ ఇకపై 70 కోట్లు రావడం కష్టంగా మారింది.
సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. బూతు కంటెంట్ అనే అంశం హైలైట్ అవుతుంది. రోటీన్ కామెడీ చిత్రంగా రైటర్లు తేల్చేసారు. దీంతో 'కేసరి చాప్టర్ 2' రూపంలో దక్కిన సంతోషం అక్షయ్ కుమార్ అక్కడికే పరిమితం చేయాల్సి వస్తోంది. తదుపరి అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించిన కన్నప్ప రిలీజ్ అవు తుంది. టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతోన్న పాన్ ఇండియా చిత్రమిది. ఇది గాక అక్షయ్ హీరోగా నటిస్తోన్న అరడజను సినిమాలు సెట్స్ లో ఉన్నాయి.