స్టార్ హీరో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో కంబ్యాక్!
ఆ సినిమా కూడా 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఖర్చు అవ్వడంతో బాక్సాఫీస్ లెక్కలో క్లారిటీ లోపించింది.
By: Tupaki Desk | 19 Jun 2025 7:00 AM ISTకిలాడీ అక్షయ్ కుమార్ గత కొంత కాలంగా సక్సెస్ అన్నది అందని ద్రాక్షగా మారిన సంగతి తెలిసిందే. చేసిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. వైఫల్యాల ప్రభావం అక్షయ్ కుమార్ పై ఎంతగా ప్రభావం చూపిందంటే? చివరికి ఆయన కంట కన్నీళ్లు మాత్రమే రాలేదు అన్నంతగా ఆయన మనో వేదన బయట పడిన సందర్భాలెన్నో. సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్, విమర్శలన్నింటిని తట్టుకుని నిలబడ్డాడు.
ఏనాడు మనో ధైర్యాన్ని కోల్పోలేదు. గుండె నిబ్బరంతో నిలబడి నేడు గెలిచాడు. అవును కిలాడీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. ఇటీవల రిలీజ్ అయిన 'హౌస్ ఫుల్ 5' ఇప్పటికే 200 కోట్ల క్లబ్ ని క్రాస్ చేసింది. 300 కోట్ల వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. సినిమాకు రివ్యూలు డివైడ్ గా వచ్చినా అంతిమంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు రావడంతో రివ్యూలు తేలిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ దిల్ ఖుష్ లో ఉన్నాడు.
రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 'హౌస్ ఫుల్ 5' కంటే ముందే 'కేసరి చాప్టర్ 2 'తో నే అక్షయ్ కుమార్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్న సంకేతాలు కనిపించాయి. ఆ సినిమా కూడా 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఖర్చు అవ్వడంతో బాక్సాఫీస్ లెక్కలో క్లారిటీ లోపించింది. కానీ సినిమాకు నష్టాలు రాకపోవడంతో అక్షయ్ సేఫ్ జోన్ లో నిలిచాడు.
అలా అక్షయ్ కంబ్యాక్ అన్నది ఆ సినిమాతోనే వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'వెల్కమ్' ప్రాంచైజీలో భాగంగా థర్డ్ వెంచర్ సెట్స్ లో ఉండి. అలాగే 'బూత్ బగ్లా' అనే మరో చిత్రం కూడా చేస్తున్నాడు. రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడమే తరువాయి.
కిలాడీ అక్షయ్ కుమార్ గత కొంత కాలంగా సక్సెస్ అన్నది అందని ద్రాక్షగా మారిన సంగతి తెలిసిందే. చేసిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. వైఫల్యాల ప్రభావం అక్షయ్ కుమార్ పై ఎంతగా ప్రభావం చూపిందంటే? చివరికి ఆయన కంట కన్నీళ్లు మాత్రమే రాలేదు అన్నంతగా ఆయన మనో వేదన బయట పడిన సందర్భాలెన్నో. సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్, విమర్శలన్నింటిని తట్టుకుని నిలబడ్డాడు.