Begin typing your search above and press return to search.

మహేష్ జంటతో చరణ్ చిరునవ్వు

అయితే వీరందిరలో మహేశ్​ బాబు-రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు

By:  Tupaki Desk   |   20 Sep 2023 8:38 AM GMT
మహేష్ జంటతో చరణ్ చిరునవ్వు
X

టాలీవుడ్​లో సూపర్ స్టార్-మెగాస్టార్ ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. అయితే తాజాగా ఈ రెండు కుటుంబాలకు చెందిన వారసులు రామ్​చరణ్​-మహేశ్ బాబు ఒకే చోట కలిసి సందడి చేశారు. ఇద్దరు సరదాగా ముచ్చటించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ పిక్స్​ సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

వివరాళ్లోకి వెళితే.. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు గ్రాండ్​గా జరుగుతున్నాయి. ఏఎన్​ఆర్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అక్కినేని కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. అలాగే ఈ శతజయంతి ఉత్సవాలకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.

వీరిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, దర్శకుడు రాజమౌళి, కీరవాణి, హాస్య నటుడు బ్రహ్మానందం, మురళీమోహన్‌, శ్రీకాంత్‌, జగపతిబాబు, మోహన్‌బాబు, మెగా పవర్ స్టార్​ రామ్‌చరణ్‌, సూపర్ స్టార్ మహేశ్​ బాబు, రానా, నాని, విష్ణు, సుబ్బిరామిరెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, డీజీపీ అంజనీకుమార్‌, పాల్గొన్నారు.

అయితే వీరందిరలో మహేశ్​ బాబు-రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారితో పాటు మహేశ్​ భర్య నమ్రత కూడా ఉన్నారు. మధ్యలో నమ్రత కూర్చోగా.. అటు ఇటు మహేశ్-చరణ్​ కూర్చొని.. నవ్వులు చిందిస్తూ సరదాగా మాట్లాడుకోవడం ఎంతో చూడముచ్చటగా కనిపించింది.

రామ్​చరణ్ బ్లాక్ కలర్ డ్రెస్​లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉండగా.. నమ్రత గ్రీన్ కలర్​ ట్రెడిషనల్ లుక్​లో... మహేశ్​ ఎప్పటిలాగే ప్లెయిన్​ మెరూన్ టైప్​​ కలర్ షర్ట్​తో అందంగా కనిపించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన మెగా సూపర్ స్టార్ ఫ్యాన్స్​ తెగ మురిసిపోతున్నారు. వాటిని మరింత ట్రెండ్ చేస్తున్నారు.

ఇకపోతే మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. రామ్​ చరణ్​ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాదే రానుంది.