Begin typing your search above and press return to search.

కింగ్ నుంచి మ‌రో స‌ర్ ప్రైజ్..ఇది ఊహించ‌నిదే!

కింగ్ నాగార్జున సోలో చిత్రాల‌తో పాటు మల్టీస్టార‌ర్ చిత్రాలు చాలా కాలంగా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 March 2024 5:09 AM GMT
కింగ్ నుంచి మ‌రో స‌ర్ ప్రైజ్..ఇది ఊహించ‌నిదే!
X

కింగ్ నాగార్జున సోలో చిత్రాల‌తో పాటు మల్టీస్టార‌ర్ చిత్రాలు చాలా కాలంగా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పూర్తిగా ద‌ర్శకుల హీరో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. క‌థ‌..పాత్ర‌ని బ‌ట్టి త‌న‌న్నా చిన్న స్టార్ అయినా..పెద్ద స్టార్ అయినా కలిసి న‌టించ‌డానికి ఏమాత్రం వెనుక‌డ‌గు వేయ‌రు. న‌టుడిగా అన్ని ర‌కాల సినిమాలు..అంద‌రితో క‌లిసి ప‌నిచేయాలి అన్న‌ది కింగ్ నినాదం. ఇప్ప‌టికే ఆయ‌న చాలా మంది న‌టుల‌తో క‌లిసి ప‌నిచేసారు. ప్ర‌స్తుతం కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తో క‌లిసి `కుబేర` అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ ఈడీ అధికారి పాత్ర‌లో కింగ్ క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ధ‌నుష్ న్యూ లుక్ రిలీజ్ అయిన నేప‌థ్యంలో నాగ్ లుక్ ఎలా ఉంటుంది? అన్న ఉత్సాహం అభిమానుల్లో రెట్టింపు అవుతుంది. ఆ అప్ డేట్ రాక‌ముందే తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌మిళ ద‌ర్శ‌కుడు న‌వీన్ అనే కొత్త కుర్రాడితో నాగార్జున ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కుబేర త‌ర్వాత ఈ సినిమా ప‌ట్టాలెక్కించ‌డానికి నాగ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌క‌ట‌న రాగానే న‌వీన్ తో నాగ్ చేస్తోన్న సోలో ప్రాజెక్ట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇది కూడా మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మ‌ని తాజాగా లీకులందు తున్నాయి. జ్ఞాన్ వేల్ రాజా నిర్మిస్తున్న సినిమా జులై నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం. ఇందులో నాగ్ తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా న‌టిస్తున్నారుట‌. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ చిత్ర‌మ‌ని స‌మాచారం.

దీంతో ఆ ఇమేజ్ ఉన్న న‌టుడే న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఆ హీరో కోలీవుడ్ నుంచి ఉంటాడా? టాలీవుడ్ నుంచి ఉంటాడా? అన్న‌ది చూడాలి. ద‌ర్శ‌క‌-నిర్మాత‌లిద్ద‌రు కోలీవుడ్ వాళ్లు కావ‌డం తో ఈ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ స్టార్ నే తీసుకుంటార‌ని తెలుస్తుంది.