Begin typing your search above and press return to search.

మన స్టార్స్ తో ఎప్పుడు నాగ్‌ సర్‌...?

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ టైమ్‌ లో మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. కానీ 1980 నుంచి మల్టీ స్టారర్‌ సినిమాలు కనుమరుగయ్యాయి

By:  Tupaki Desk   |   21 April 2024 5:03 AM GMT
మన స్టార్స్ తో ఎప్పుడు నాగ్‌ సర్‌...?
X

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ టైమ్‌ లో మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. కానీ 1980 నుంచి మల్టీ స్టారర్‌ సినిమాలు కనుమరుగయ్యాయి. ఈ మధ్య కాలంలో చిన్న హీరోలతో పాటు కొందరు పెద్ద హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.

మల్టీస్టారర్ సినిమాలకు మొదటి నుంచి కూడా నాగార్జున ఆసక్తిని కనబర్చుతున్నాడు. గతంలో పలువురు యంగ్‌ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్‌ చేసుకున్న నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమా కోసం బాలీవుడ్‌ లో రణబీర్ కపూర్ తో కలిసి నటించాడు. ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్‌ హీరో ధనుష్ తో కలిసి 'కుబేర' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ధనుష్ తో ఒక వైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను చేస్తున్న నాగార్జున మరో వైపు తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ సినిమాలో కీలక పాత్రను పోషించేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. రజినీకాంత్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే చిన్న పాత్రకి కూడా ప్రముఖ స్థానం ఉంటుంది. అందుకే ఈ సినిమాలో నాగార్జున నటించడం అక్కినేని ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగించే విషయం అనడంలో సందేహం లేదు.

తమిళ స్టార్ హీరోల సినిమాల్లో, హిందీ సినిమాల్లో నటిస్తున్న నాగార్జున ఎప్పుడు టాలీవుడ్ స్టార్‌ హీరోలతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటాడా అంటూ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌ లో నాగార్జున నటించబోతున్న పెద్ద మల్టీ స్టారర్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్‌ తో పాటు అంతా ఎదురు చూస్తున్నారు. మరి అది ఎప్పుడు అనేది చూడాలి.