Begin typing your search above and press return to search.

కింగ్ నాగార్జున.. ఈ లెక్క తేలేదెప్పుడో?

కింగ్ నాగార్జున ఈ ఏడాది నా సామి రంగా మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు

By:  Tupaki Desk   |   27 March 2024 3:57 AM GMT
కింగ్ నాగార్జున.. ఈ లెక్క తేలేదెప్పుడో?
X

కింగ్ నాగార్జున ఈ ఏడాది నా సామి రంగా మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. వరుస డిజాస్టర్స్ తర్వాత నాగార్జున ఖాతాలో ఈ మూవీతో హిట్ పడింది. ప్రస్తుతం నాగ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి కుభేర మూవీ చేస్తున్నారు. మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో ఏషియన్ మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీంతో పాటుగా తమిళ్ డైరెక్టర్ నవీన్ తో నాగార్జున ఒక మూవీ చేస్తున్నట్లు గతంలో చెప్పారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఈ మూవీ ఉంటుందంట. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కెఈ జ్ఞాన్ వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారంట. జులై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కూడా మల్టీ స్టారర్ గానే ఉండబోతోందని సమాచారం. తమిళ్, మలయాళం, హిందీ భాషల నుంచి ఒకరిని ఈ మూవీలో మరోక సెకండ్ హీరో రోల్ కోసం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఒక యంగ్ హీరో మూవీలో చేయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. అయితే అతను ఏ భాషనుంచి వస్తాడనేది తెలియాల్సి ఉంది. మరో వైపు బంగార్రాజు సీక్వెల్ కూడా చేయాలనే ప్లానింగ్ లో కింగ్ నాగార్జున ఉన్నారు.

అయితే ఇప్పుడు కొత్త చిక్కు వచ్చింది. ఇంతకీ ఈ మూడింటిలో నాగార్జున వందో సినిమా ఏది అనేది అభిమానుల ప్రశ్న. సినిమాలు అయితే ఎనౌన్స్ చేసేసారు. కానీ కింగ్ నాగార్జున వందో సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాలని అనుకుంటున్నాడు. ఆ మూవీలో అక్కినేని అఖిల్ కూడా నటిస్తాడని గతంలో చెప్పారు. అయితే ప్రస్తుతానికి వందో సినిమా గురించి ఎలాంటి చర్చ నడవడం లేదు.

కానీ కింగ్ నాగార్జున ప్రస్తుతం కమిట్ అయిన ఈ మూడు సినిమాలలో ఒకటి 100వ చిత్రంగా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆ సినిమా ఏంటనేది కన్ఫర్మ్ చేస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నాగార్జున ప్రతీ సంక్రాంతికి ఒక మూవీతో వస్తానని క్లారిటీ ఇచ్చాడు. 2025 లో బంగార్రాజు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది.

నాగచైతన్య తో ఒకసారి బంగార్రాజు క్యారెక్టర్ ను స్ట్రాంగ్ గా ఎలివేట్ చేశారు. ఇక అఖిల్ ను కూడా ఆ సీరీస్ లోకి దింపే అవకాశం ఉందట. నాగ్ అయితే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సెట్టయితే గాని 100 సినిమాపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపించడం లేదట. మరి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలియాలి అంటే కాలమే సమాధానం ఇవ్వాలి.